- రైతుబంధు, ప్రభుత్వ ఉద్యోగుల డీఏ, రైతు రుణమాఫీకి అనుమతించం
- రాష్ట్ర ప్రభుత్వ వినతిని తిరస్కరించిన ఈసీ
హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికలు హీటు పుట్టిస్తున్నాయి. ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయా పార్టీలు ప్రచారంలో నిమగ్నమయ్యాయి. అయితే.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉంది. దీంతో రాష్ట్రంలో అమలు కావాల్సిన సంక్షేమ పథకాలు అమలు నిలిచిపోయింది. దీంతో లబ్దిదారుల్లో ఆందోళన నెలకొంది. అయితే.. లబ్దిదారులకు సంక్షేమ ఫలాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కానీ.. దానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనుమతించలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతుబంధు, ప్రభుత్వ ఉద్యోగుల డీఏల విడుదల, రైతు రుణమాఫీల కోసం నిధులు విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం అధికారులకు వినతిపత్రం అందించారు. కానీ.. దీనికి ఈసీ అనుమతిని నిరాకరించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులను ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. పెండిరగ్ డీఏలు ఇప్పుడు ఎలా ఇస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీ ప్రశ్నించింది. అయితే.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 30 పోలింగ్ జరుగనుంది. అలాగే డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సమయంలో ఎలాంటి పథకాలు అమలు గానీ, డబ్బులు జమ చేసే కార్యక్రమాలు గానీ చేయకూడదు. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.