Saturday, May 4, 2024

బంగాళాఖాతంలో భూ ప్రకంపణలు

తప్పక చదవండి

న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో భూకంపం వచ్చింది. సోమవారం ఉదయం 8.35 గంటలకు ఉత్తరకాశీలో స్వల్పంగా భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 3.0గా నమోదయింది. భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజి తెలిపింది. ఉదయం 9.38 గంటలకు బంగాళాఖాతంలో 4.3 తీవ్రతతో భూమి కంపించింది. 37 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని ఎన్‌సీఎస్‌ వెల్లడిరచింది. సోమవారం తెల్లవారుజామున 2.31 గంటలకు అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భూమి కంపించింది. దీని తీవ్రత 4.3గా నమోదయిందని ఎన్‌సీఎస్‌ తెలిపింది. భూ అంతర్భాగంలో 35 కిలోమీటర్లలో కదలికలు సంభవించాయని వెల్లడిరచింది. భూకంప కేంద్రం అండమాన్‌ సముద్రంలో ఉంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు