Sunday, April 28, 2024

బంగ్లాదేశ్‌లో భూకంపం

తప్పక చదవండి
  • రిక్టర్‌స్కేల్‌పై 5.6గా నమోదు

న్యూఢిల్లీ : బంగ్లాదేశ్‌లో శనివారం ఉదయం 5.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. చిట్టగాంగ్‌లో భూ అంతర్భాగంలో 55 కిలోవిూటర్ల లోతులో కదలికలు సంభవించాయని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ వెల్లడిరచింది. ఈ భూకంపం కారణంగా పొరుగున ఉన్న పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోనూ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. బెంగాల్‌లోని కోల్‌కతా సహా పలు ప్రాంతాల్లో భూమి ఒక్కసారిగా కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, ఈ ప్రకంపనల కారణంగా రాష్ట్రంలో ఎలాంటి నష్టం వాటిల్లలేదని పశ్చిమ బెంగాల్‌ విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. ‘ఇప్పటి వరకూ అందిన సమాచారం మేరకు.. భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదు’ అని అధికారులు తెలిపారు. కోల్‌కతా పోలీసులు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు కూడా ఇదే విషయాన్ని వెల్లడిరచింది. కాగా, శనివారం ఉదయం 9.41 గంటలకు చిట్టగాంగ్‌లోని రామ్‌గంజ్‌లో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 5.6గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. భూ అంతర్భాగంలో 55 కిలోవిూటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడిరచింది. రామ్‌గంజ్‌ సవిూపంలో భూకంప కేంద్రం ఉన్నదని తెలిపింది. నిమిషాల వ్యవధిలో చిట్టగాంగ్‌ ప్రావిన్స్‌లోని లక్ష్మీపూర్‌, చాంద్‌పూర్‌, కొమిల్లాలో భూమి కంపించిందని పేర్కొంది. అదేవిధంగా రాజ్‌షాహి, సిల్హెట్‌, ఢాకా, నొవాఖలి, కుష్తియాలో కూడా ప్రకంపణలు
చోటుచేసుకున్నాయని చెప్పింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు