Sunday, May 19, 2024

తెలంగాణను ఇతరుల చేతుల్లో పెట్టవద్దు : మంత్రి గంగుల కమలాకర్‌

తప్పక చదవండి

కరీంనగర్‌ : తెలంగాణను ఇతరుల చేతుల్లో పెట్టవద్దని, పొరపాటున వేరేవారికి అధికారం ఇస్తే రాష్ట్రం ఆగమాగమవుతుందని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. కరీంనగర్‌ నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలంలో శుక్రవారం ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌ సంపద విూద ఆంధ్రా నేతల కన్ను పడిరదని, కేసీఆర్‌ మళ్లీ రాకపోతే సంపదంతా వారు తీసుకువెళతారని ఆందోళన వ్యక్తం చేశారు. వెలుగులు విరజిమ్ముతున్న తెలంగాణను మళ్లీ గుడ్డి దీపంగా మార్చవద్దన్నారు. బీఆర్‌ఎస్‌కు ఓటు వేసి.. కేసీఆర్‌కు పట్టం కట్టాలని గంగుల కమలాకర్‌ కోరారు.
తెలంగాణ రాకముందు రాష్ట్రంలో కరెంట్‌, నీళ్లు లేవని, ఫించన్‌ వచ్చేదికాదని గంగుల కమలాకర్‌ విమర్శించారు. ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని.. అందుకనే తెలంగాణ రావాలని కోట్లాడమని.. రాష్ట్రం వచ్చాక మన కరెంట్‌, నీళ్లు, నిధులు వస్తున్నాయని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌, పార్టీలు మాట్లాడుకుని హైదరాబాద్‌ను ఆంధ్రాలో కలిపే ప్రయత్నం చేస్తున్నారని.. తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని అన్నారు. అసలు కేసీఆర్‌ లేకపోతే తెలంగాణ వచ్చేదా? అని అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ వస్తే మళ్లీ ఆంధ్రా పెత్తనం వస్తాదని.. తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకుందామని అన్నారు. తెలంగాణలో మన పిల్లల భవిష్యత్‌ బాగుండాలంటే కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రిగా ఉండాలని గంగుల కమలాకర్‌ వ్యాఖ్యానించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు