Saturday, May 18, 2024

అధికారులతో సీపీ సీవీ అనంత్ వీడియో కాన్ఫరెన్స్..

తప్పక చదవండి
  • ఎన్నికల నిర్వహణపై పలు సూచనలు..

హైదరాబాద్ : నవంబర్ 30వ తేదీన జరగనున్న టి.ఎస్.ఎం.ఎల్.ఏ. ఎన్నికల కోసం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నందున, సిటీ పోలీస్ కమీషనర్, సీవీ ఆనంద్, సంసిద్ధత స్థితిని నిశితంగా అంచనా వేయడానికి, సిబ్బందికి ఎలక్షన్ విధులపై దిశా, నిర్దేశం చెయ్యటానికి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన నాలుగు కీలక అంశాలను నొక్కిచెప్పారు.. ప్రొసీడ్యూర్స్, నివేదికల సకాలంలో తయారు చెయ్యటం, పర్యవేక్షణ, పోలీసు బలగాల యొక్క సమగ్ర శిక్షణ అండ్ బ్రీఫింగ్. ఎన్నికలు ముగిసే వరకు ఈ అంశాలే కీలకమని ఆయన ఉద్ఘాటించారు. అంతే కాకుండా, ఆకస్మిక తనిఖీలను ముమ్మరం చేయడంపై స్పష్ట మైన ఆదేశాలు జారీ చేసారు. డిసిపిలు, ఎసిపిలు, నోడల్ ఎసిపిలకు వారి వారి స్థాయిలలో రాజకీయ పార్టీలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తమ కార్యాలయాల్లో 24 గంటలూ పని చేసే విధంగా ప్రత్యేక సెల్‌లను యాక్టివేట్ చేయాలని ఆయన ఆదేశించారు. అదనంగా, పాక్షికంగా తమ పరిధిలోకి వచ్చే పోలింగ్ స్టేషన్‌ల సమర్థవంతమైన భద్రతను నిర్ధారించడానికి పొరుగు కమిషనరేట్‌ల అధికారులతో సమన్వయ ప్రణాళిక అవసరమని సిపి పేర్కొన్నారు.

అక్రమ నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు లేదా ఇతర ప్రలోభాల సంబంధించిన ఏవైనా సంఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ప్రచార సమయంలో వివిధ రాజకీయ పార్టీలు ఒకే మార్గంలో తారస పడకుండా చూసుకోవడం, అందుకు అనుగుణంగా రూట్ ప్లానింగ్ , టైమింగ్, పర్మిషన్ల జారీ చెయ్యటం ద్వారా.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడటం తదితర విషయాలు చర్చకు వచ్చాయి. లైసెన్స్ పొందిన తుపాకీలన్నీ తప్పనిసరిగా అప్పగించబడాలి.. ఎన్నికలు ముగిసే వరకు కొత్త లైసెన్స్‌లు జారీ చేయకూడదు. స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు (ఎస్‌ఎస్‌టి) సన్నద్ధం చెయ్యటం.. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తమ తనిఖీలను మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ ఇంటర్ కమిషనరేట్ చెక్‌పోస్టుల సంఖ్యను 11 నుంచి 18కి పెంచనున్నారు. నాన్-బెయిలబుల్ వారెంట్‌లను అమలు చేయడం, సోషల్ మీడియా పర్యవేక్షించడం, హవాలా ఆపరేటర్లపై నిఘా, సమస్యాత్మక వ్యక్తులపై బైండింగ్ ఓవర్ చెయ్యటం.. ఇతర కార్యాచరణ విషయాలపై కూడా సమావేశంలో చర్చలు జరిగాయి. సిటీ పోలీస్ ఫోర్స్‌లో 100 శాతం ఫెసిలిటేటింగ్ సెంటర్ల ద్వారా ఓటు వేయాలని సీపీ ఆనంద్ తెలిపారు. విక్రమ్ సింగ్ మాన్, అడిషనల్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్), మాట్లాడుతూ ఈసీఐ ముందుగా నిర్ణయించిన సమయ పరిమితుల్లో నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఉద్ఘాటించారు. నోడల్ ఏసీపీల ద్వారా బాధ్యతల వికేంద్రీకరణ, విజిబుల్ పోలీసింగ్‌లో పెరుగుదల, వివిధ చట్టపరమైన నిబంధనలు, ఇతర ప్రోవిజన్స్ పై సిబ్బందికి అవగాహన కల్పించారు. విశ్వ ప్రసాద్, అదనపు పోలీసు కమీషనర్, స్పెషల్ బ్రాంచ్ మాట్లాడుతూ.. ఫీల్డ్ లెవెల్ ఇంటెలిజెన్స్ పొందడం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. నగదు, విలువైన లోహాలు, ఇతర ఉచితాలను స్వాధీనం చేసుకునేటప్పుడు విధానాలను ఏకరీతిగా వర్తింపజేయాలని సూచించారు. నకిలీ ఓటర్ ఐడీ తయారీదారులు, రవాణా సంస్థలు, కొరియర్ సర్వీస్ ప్రొవైడర్లపై నిఘా ఉంచడం, ఎన్నికల నేరాలపై కఠిన చర్యలు తీసుకోవడం, పోలీసు బలగాలకు స్పష్టమైన సూచనలు అందించడం వంటి ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. ట్రాఫిక్ అదనపు కమీషనర్ సుదీర్ బాబు, ఎన్నికలు ముగిసే వరకు నగరంలో ట్రాఫిక్ విభాగం తీసుకునే చర్యల పై వివరించారు. ఎన్నికల సంబంధిత విధుల్లో నిమగ్నమైన పోలీసు అధికారులకు ఎస్కార్ట్‌లు, వాహనాలు, వ్యక్తిగత భద్రతా అధికారులు (పిఎస్‌ఓలు), డ్రైవర్‌లను మోహరించేందుకు చేసిన లాజిస్టికల్ ఏర్పాట్ల గురించి సిఎఆర్ హెడ్‌క్వార్టర్స్ జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాసులు వివరించారు. సీటీసీలలో సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ కంపెనీల వసతి ఏర్పాటు, ఇతర సంబంధిత అంశాల గురించి వివరించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు