Sunday, May 19, 2024

శంషాబాద్‌లో దట్టమైన పొగమంచు

తప్పక చదవండి
  • విజిబిలిటీ లేకపోవడంతో విమానాల మళ్లింపు
  • విజయవాడ, బెంగూళూరులకు పలు విమానాలు

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో దట్టంగా పొగ అలముకుంది. దీంతో విజిబిలిటీ దారుణంగా పడిపోయింది. శంషాబాద్‌లో విమానాల ల్యాండిరగ్‌కు సమస్య ఏర్పడిరది. దట్టమైన పొగమంచుకారణంగా విజిబిలిటీ లేకపోవడంతో విమానాలను దారిమళ్లించారు. తక్కువ దూరంలోని వాహనాలు కనిపించని పరిస్థితి ఏర్పడిరది. దట్టమైన పొగమంచు కారణంగా విజిబిలిటీ సరిగా లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పొగ మంచు ప్రభావం విమానాల రాకపోకలపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ఉదయం శంషాబాద్‌ లో పొగమంచు కారణంగా పలు విమానాలను అధికారులు దారి మళ్లించారు. శంషాబాద్‌కు రావాల్సిన ఐదు విమానాలను ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. ఉదయం శంషాబాద్‌లో ల్యాండ్‌ కావాల్సిన మూడు విమానాలను దారి మళ్లించారు. ఛత్తీస్‌గఢ్‌, గోవా, తిరువనంతపురం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి రావాల్సిన విమానాలను గన్నవరంలో అత్యవసరంగా ల్యాండ్‌ చేసినట్లు వివరించారు. అదేవిధంగా బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన విమానాన్ని సైతం తిరిగి బెంగళూరు మళ్లించినట్లు చెప్పారు. ముంబై నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన 873 (విస్తారా) విమానం ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తిరిగి ముంబైకి మళ్లించినట్లు అధికారులు వెల్లడిరచారు. గన్నవరం విమానాశ్రయంలో మూడు విమానాలను అత్యవసర ల్యాండిరగ్‌ చేయడం ఆసక్తికరంగా మారింది. అసలు ఏం జరుగుతోందో అర్థం కాక ప్రయాణికులు షాక్‌ అయ్యారు. హైదరాబాద్‌లో వాతావరణం అనుకూలించకపోవటంతో గన్నవరం విమానాశ్రయంలో అత్యవసర ల్యాండిరగ్‌ చేశారు. చండీఘర్‌ నుంచి హైద్రాబాద్‌, గోవా నుంచి హైద్రాబాద్‌, తిరువనంతపురం నుంచి హైద్రాబాద్‌ వెళ్ళవలసిన మూడు ఇండిగో విమానాలు గన్నవరంలోనే ల్యాండ్‌ అయ్యాయి. ఒక్కో విమానంలో దాదాపు 165 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. ఏమి అవుతుందో తెలియక అయోమయంలో ప్రయాణికులు ఉన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు