Saturday, May 18, 2024

మోసపోయి రూ. 52 ల‌క్ష‌లు పోగొట్టుకున్న ఇంజ‌నీర్‌

తప్పక చదవండి
  • రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు
  • అధిక ఆదాయం కోసం ఆశ పడుతున్న అమాయకులు

బెంగ‌ళూర్ : రోజుకో త‌ర‌హా స్కామ్‌తో సైబ‌ర్ నేర‌గాళ్లు రెచ్చిపోతున్నారు. పార్ట్‌టైం జాబ్‌లు, యూట్యూబ్ వీడియోలు లైక్ చేస్తే ఆదాయం వ‌స్తుంద‌ని మ‌భ్య‌పెడుతూ అమాయ‌కుల నుంచి రూ. ల‌క్ష‌లు దండుకుంటున్నారు. ఇక లేటెస్ట్‌గా అమెజాన్‌లో పార్ట్ టైం జాబ్ పేరుతో ఓ ఇంజ‌నీర్‌ను స్కామ‌ర్లు ఏకంగా రూ.52 ల‌క్ష‌ల‌కు బురిడీ కొట్టించారు. క‌ర్నాట‌క‌లోని ఉడిపికి చెందిన టెకీని స్కామ‌ర్లు బోల్తా కొట్టించారు. 27 ఏండ్ల ఇంజ‌నీర్‌కు నిందితుడు అమెజాన్ ఎగ్జిక్యూటివ్‌గా ప‌రిచ‌యం చేసుకుంటూ వాట్సాప్ మెసేజ్ చేశాడు. మెరుగైన రిట‌న్స్‌తో అమెజాన్‌లో పార్ట్‌టైం జాబ్‌ను నిందితుడు టెకీకి ఆఫ‌ర్ చేశాడు. ఫైనాన్షియ‌ల్ రివార్డ్స్ పొందేందుకు నిర్ధిష్ట టాస్క్‌ల‌ను పూర్తిచేయాల‌ని బాధితుడిని న‌మ్మించాడు. ఇది స‌రైన అవ‌కాశ‌మే అని భావించిన టెకీ స్కామ‌ర్లు చెప్పిన‌ట్టే చేశాడు. టాస్క్‌ల్లో భాగంగా భారీ రిట‌న్స్ వ‌స్తాయ‌ని మ‌భ్య‌పెడుతూ టెకీతో పెద్ద‌మొత్తంలో ఇన్వెస్ట్ చేయించారు. స్కామ్‌లో భాగంగా నిందితులు బాధితుడి నుంచి ఆగ‌స్ట్ 3 నుంచి సెప్టెంబ‌ర్ 23 మ‌ధ్య ఏకంగా రూ. 52.13 ల‌క్ష‌లు రాబ‌ట్టారు. స్కామ‌ర్ల బ్యాంకు ఖాతాల‌కు బాధిత టెకీ ప‌లుమార్లు డ‌బ్బు బ‌దిలీ చేసినా వారి నుంచి ఎలాంటి మొత్తం రాక‌పోవ‌డంతో మోస‌పోయాన‌ని గుర్తించి పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు