Saturday, July 27, 2024

ఆన్‌లైన్ అడ్డాగా సైబ‌ర్ స్కామ‌ర్లు

తప్పక చదవండి
  • దివాళీ సందడిలో కస్టమర్లను టార్గెట్ చేస్తూ స్కాం

న్యూఢిల్లీ : దివాళీ సంద‌డి మొద‌ల‌వ‌గా పండ‌గ వేడుక‌ల మాటున ఆన్‌లైన్ అడ్డాగా సైబ‌ర్ స్కామ‌ర్లు చెల‌రేగుతున్నారు. దివాళీ షాపర్ల‌ను టార్గెట్ చేస్తూ న‌కిలీ ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్ వెబ్‌సైట్స్‌తో సైబ‌ర్ నేరగాళ్లు చీక‌టి దందాకు తెర‌లేపారు. న‌కిలీ ఈ-కామ‌ర్స్ సైట్స్ పేరుతో స్కామ‌ర్లు క‌స్ట‌మ‌ర్ల‌ను దోచేస్తున్న ఉదంతాలు చోటుచేసుకున్నాయ‌ని సైబ‌ర్ ప‌రిశోధ‌కుల‌తో కూడిన క్లౌడ్ఎస్ఈకే పేర్కొంది.
న‌కిలీ వెబ్‌సైట్ల ప‌ట్ల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించింది. రీచార్జ్‌, ఈ-కామ‌ర్స్ సెక్టార్స్‌లో పెద్దఎత్తున ఫిషింగ్ క్యాంపెయిన్‌లు సాగుతున్నాయ‌ని క్లౌడ్ఎస్ఈకే బృందం గుర్తించింది. పండ‌గ సీజ‌న్‌లో క్రిప్టో రీడైరెక్ట్స్‌, బెట్టింగ్ స్కీమ్స్‌తో బిగ్ బ్రాండ్స్ ప్ర‌తిష్ట‌ను స్కామ‌ర్లు దెబ్బ‌తీస్తున్నార‌ని తెలిపింది. గ‌త వారం ఫేస్‌బుక్ యాడ్స్ లైబ్ర‌రీ నుంచి క్లౌడ్ఎస్ఈకే టీం దాదాపు 828 పైగా మోస‌పూరిత డొమైన్స్‌ను వెలికితీశాయి. ఈ డొమైన్ల‌న్నీ ఫిషింగ్‌కు సంబంధించిన‌వ‌ని, ఇవ‌న్నీ యూజ‌ర్ల డేటాను సంగ్ర‌హించేవేన‌ని క్లౌడ్ఎస్ఈకే సైబ‌ర్ ఇంటెలిజెన్స్ చీఫ్ రిషిక దేశాయ్ పేర్కొన్నారు. ఇవి క‌స్ట‌మ‌ర్ల ఆన్‌లైన్ షాపింగ్‌ను సంక్లిష్టం చేయ‌డ‌మే కాకుండా ఆర్ధిక మోసాల‌కు తెర‌తీస్త‌యాని ఆమె హెచ్చ‌రించారు. ఈ ట్రిక్స్‌ను ప‌సిగ‌ట్ట‌డం ద్వారా దివాళీ సీజ‌న్‌లో ఎంతోమంది క‌స్ట‌మ‌ర్ల‌ను కాపాడుకోగ‌లుగుతాయ‌ని చెబుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు