Sunday, April 28, 2024

తలసాని రూటే సప ” రేటు “

తప్పక చదవండి
  • ప్రభుత్వ స్థలంలో కబ్జాదారుల నిర్మాణం
  • కోట్ల రూపాయల విలువచేసే నాలుగు వందల గజాల స్థలం..
  • కబ్జాకోరులకు అండగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు..
  • కబ్జాదారులకు నిస్సిగ్గుగా వంతపాడిన అధికారులు..
  • గతంలో కబ్జా దారులను శిక్షించి ఆ స్థలాన్ని ప్రజల ఉపయోగార్ధము
    వినియోగిస్తామని మాటిచ్చిన మంత్రి..
  • రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఆ ఊసే ఎత్తని వైనం..
  • ప్రభుత్వ భూమిని కాపాడలేని మంత్రి ఇక ప్రజలకేమి న్యాయం చేస్తారు..?
  • తెరముందు ఒక రకంగా నటిస్తాడు.. తెరవెనుక అసలు రూపం కనిపిస్తుంది..
  • ఈ ఎన్నికల్లో తలసానికి ఓటుతో బుద్ధి చెప్తామంటున్న బాపునగర్ బస్తీ వాసులు

వైట్ అండ్ వైట్ డ్రెస్ వేస్తారు.. గుబురు మీసాలతో గుంభనంగా నవ్వుతుంటారు.. వైట్ ఎలిఫెంట్ లాగా కనిపిస్తాడు.. ఆయన పెదాలు నవ్వుతుంటాయి.. కానీ ఆయన నొసలు వెక్కిరిస్తుంటాయి.. మాటల్లో ఓదార్పు వినిపిస్తుంది.. చేసే పనుల్లో అవినీతి ధ్వనిస్తుంది.. కబ్జాకోరులకు బాజాప్తా ఆపన్న హస్తం అందిస్తారు.. ఒక పార్టీ నుంచి వేరొక పార్టీకి మారినా ఆయనలోని అంతర్మథనంలో ఎలాంటి మార్పు లేదు.. అదే నైజం.. అవే కుయుక్తులు.. అవే బేరసారాలు.. అవే ఆక్రమణలు.. మొత్తంగా ఈయన గారి రూటు సప “రేటు”.. ఆయనే బీఆర్ఎస్ పార్టీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. అభిమానులు ముద్దుగా ఆలుగడ్డ శ్రీనివాస్ యాదవ్ అని పిలుచుకుంటారు.. చూడటానికి హుందాగా.. మంత్ర ముగ్ధులను చేసే మాటలతో ఇట్టే ఆకట్టుకుంటారు.. తేనెపూసిన కత్తిలా అభయం ఇస్తాడు.. కానీ చేసే పనులు చెప్పుకోవడానికే ఛండాలంగా ఉంటాయి.. ఇక ఈయనగారు చేసిన పనులు ఒకటా రెండా.. చెప్పుకుంటే ఎన్నెన్నో.. కాగా ఇప్పుడు బీఆర్ఎస్ నుండి సనత్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నాడు.. మరోసారి తనను గెలిపిస్తే మహత్కార్యాలు చేస్తానని వాగ్ధానాలు చేస్తున్నాడు.. కానీ ఆయనకు తెలియని విషయం ఏమిటంటే.. ప్రజలు నిజాలు గ్రహించారని.. ఈ సారి బుద్ధి చెప్పబోతున్నారని.. ఈయనగారు చేసిన నిర్వాకాన్ని “ఆదాబ్ హైదరాబాద్ ” ఇంతకు మునుపే ఎన్నో కథనాల ద్వారా పాఠకుల దృష్టికి తీసుకుని వచ్చింది.. మాట తప్పిన మంత్రి చేసిన వాగ్ధానాలను మరో సారి గుర్తుచేయడానికి ఆ ప్రసహనాన్ని మరోసారి మీముందుకు తీసుకుని వస్తున్నాం.. నగర నడిబొడ్డు ఎస్.ఆర్. నగర్ లో జరిగిన ఒక కబ్జా భాగోతం ఇది..

హైదరాబాద్ లోని యస్.ఆర్. నగర్ సమీపంలోని బాపునగర్ బస్తీలో గల కమిటీ హల్ ముందు ఉన్న హౌసింగ్ బోర్డ్ స్థలం.. సుమారు నాలుగు వందల గజాలు ఉందని హౌసింగ్ బోర్డు ఈ. ఈ. రాధా కృష్ణ పలుమార్లు ఆదాబ్ కి తెలుపడం జరిగింది.. అట్టి భూమి నకిలీ పత్రాలతో కబ్జా దారుల చేతులోకి వెళ్లిందని ఈ. ఈ. రాధా కృష్ణతో పాటు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం అన్నారు.. కోర్టులను సైతం తప్పుదోవ పట్టించి, నకిలీ పత్రాలతో చెలామణి అవుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవడంలో హౌసింగ్ బోర్డు ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ పూర్తిగా విఫలమయ్యారు.. ఇట్టి భూమిలో హౌసింగ్ బోర్డ్ స్థలం అని బోర్డ్ కూడా ఉండేదని.. స్థానికులతో బాటు, మంత్రి తలసాని సైతం వెల్లడించడం విశేషం.. కొంతమంది భూ కబ్జాలకు పాల్పడే వారు నకిలీ పత్రాలు సృష్టించి, హౌసింగ్ బోర్డ్ స్థలాన్ని యథేచ్ఛగా కబ్జా చేస్తుంటే, స్థానిక నాయకులు అట్టి విషయాన్ని గతంలో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వ భూమిని బాపు నగర్ బస్తీ వాసుల ప్రయోజనాల కోసం ఉపయోగించాలని మొర పెట్టుకోగా.. స్పందించిన మంత్రి కబ్జాకు గురవుతున్న స్థలాన్ని పరిశీలించి, కబ్జాకు గురైన స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, కబ్జా దారులపై చర్యలు తీసుకుంటామని, అట్టి స్థలాన్ని బస్తీ వాసులు సంక్షేమం కొరకు ఉపయోగిస్తామని అన్నారు. అయితే మంత్రి మాటలను ఖాతరు చేయని కబ్జాదారులు యథేచ్ఛగా సెలవు దినంలో భవన నిర్మాణ పనులు చేశారు.. ఈ విధంగా యథేచ్ఛగా నిర్మాణ పనులు చేశారంటే, కబ్జాదారులకు సంబంధిత అధికారుల ప్రోత్సా హం ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు.. తెర వెనుక మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఉండి ఈ కబ్జా బాగోతాన్ని పూర్తిగా సహకరించారని స్థానిక బస్తివాసులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఇచ్చిన మాటను తప్పిన మంత్రి తలసానికి ఈ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెబుతామని.. ఎన్నెన్నో అమూల్యమైన పథకాలను తెలంగాణ రాష్ట్రానికి అందిస్తున్న, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ అభ్యర్థిని ఈసారి గెలిపించుకుంటామని చెబుతుండటం గమనార్హం.. చూడాలి మరి మంత్రి గారు ఇప్పటికైనా స్పందించి.. ప్రజాభీష్టం మేరకు నడుచుకుని, తన మాటను నిలబెట్టుకుంటారా.. ప్రజలు కొట్టే దెబ్బకు ఖంగు తింటారా..? అన్నది..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు