Thursday, February 29, 2024

అవినీతికి కేరాఫ్‌ కల్వకుంట్ల కుటుంబం

తప్పక చదవండి
  • తెలంగాణలో కేసీఆర్‌ పదేళ్ల పాలన అట్టర్‌ ప్లాప్‌!
  • రాష్ట్ర ప్రభుత్వ శాఖలపై పర్యవేక్షణ కరువు
  • ఎక్కడికెళ్లిన బీఆర్‌ఎస్‌ నాయకుల అవినీతి అరాచకాలే
  • ఎన్నికల ప్రచారాల్లో పదేళ్ల నుండి పాడుతున్న పాత పాటే
  • విపక్షాలపై విమర్శలే కానీ.. తానేమీ వెలగపెట్టాడో చెప్పడు
  • పైసలిస్తుండని సభలకు వస్తున్నారు.. కేసీఆర్‌ ఏ పాటి మొనగాడో తెలుసు
  • ఉత్తుత్తి హామీలు.. ఉద్దెర ముచ్చట్లు.. కానీ చేసిందేమీ లేదు దొర
  • ఎవరు ఢిల్లీ గులాంలో తెలంగాణ ప్రజలే తేలుస్తారు

హైదరాబాద్ : తెలంగాణ ఆత్మగౌరవంగా భావించే తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరి జూన్‌ 2, 2013 లో గాన తెలంగాణ ప్రజల కల సాకారమైంది. తెలంగాణ ప్రజలు కోరుకున్న సామాజిక తెలంగాణ సాధన కొరకు కేసీఆర్ ను నమ్మి తెలంగాణ ప్రజలు ఆయనకు అధికారం కట్టబెట్టారు. కానీ, తెలంగాణ ప్రజల ఆశలు ఆకాంక్షలు నీరుగారిపోయాయి కేసీఆర్ పదేళ్ల పాలన బ్రహ్మాండమైన విడుదలకాని అట్టర్‌ ఫ్లాప్‌ గా కొనసాగింది. తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం సిద్ధించింది, ప్రజలకు కాదని కేసీఆర్ లాంటి కొంతమంది స్వార్ధపరులకేనని పదేళ్లపాటు వేచి చూస్తే కానీ ప్రజలకు అర్థం కాలే. కానీ వెనక్కి తిరిగి చూస్తే అభివృద్ధి శూన్యం. కేసీఆర్ తన కుటుంబాన్ని చూసుకున్నాడు. తెలంగాణ అభివృద్ధి ఎక్కడ జరగలేదని తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే నాటికి పుణ్యకాలం కాస్త పూర్తయింది.

ప్రభుత్వ శాఖల పనితీరుపై పర్యవేక్షణ కరువు
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 10 ఏళ్ల అవుతున్న ఇప్పటివరకు ఏ ఒక్క ప్రభుత్వ శాఖపై పర్యవేక్షించిన దాఖలాలు లేవు ధరణి, రెవెన్యూ, జిఎచ్ఎంసి, ఎచ్ఎండిఎ, పోలీస్‌, విద్యుత్‌, గ్రామీణ అభివృద్ధి, మున్సిపాలిటీ, విద్య ఇలా ఎన్నో ప్రభుత్వ శాఖలపై ప్రజలు ఫిర్యాదులు చేసిన కూడా ప్రభుత్వం ఎక్కడైనా పర్యవేక్షణ చేసిందా! గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో ఎవరైనా ప్రభుత్వ అధికారులు పనిచేయకుంటే వారిపై ఉన్నతాధికారులు వేటు వేసేవారని అప్పట్లో భయానికో భక్తి కో ప్రజలకు పనులు జరిగేవని. ఏదైనా ప్రసార మాధ్యమాలలో పత్రికల్లో, టీవీల్లో ప్రభుత్వ వ్యతిరేక వార్తలు వస్తే గత ప్రభుత్వాలు దానిని పరిశీలించుకునేవి, ఎవరైనా అలాంటి అధికారులు ఉంటే వారిని అప్పటికప్పుడు సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన సందర్భాలు కోకొల్లలు. ఎవరైనా ప్రజలను ఇబ్బంది పెడితే వారు నేరుగా వెళ్లి పత్రికా రిపోర్టర్లను కలిసేవారని వార్త ద్వారా ప్రజలకు న్యాయం జరిగిన సందర్భాలు కూడ ఉన్నాయని, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో కంచె చేను మేసిన చందంగా ప్రభుత్వ పనితీరు ఉందని ఇలాంటి దరిద్రమైన ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నామని ప్రజలు తమకు తామే నిందించుకుంటున్నారు. ప్రజలు పనుల పేరుతో కట్టే డబ్బులతో జీతాలు తీసుకుంటూ వారికి న్యాయం చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న ఏకైక కేసీఆర్ ప్రభుత్వం అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు వారికి కేటాయించిన శాఖల పనితీరుపై రివ్యూ మీటింగ్‌ లు చేసి ఎక్కడన్నా లోపాలు ఉంటే వాటిని సరిదిద్దేవారని అలాంటి పరిస్థితులు ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ కనపడతా లేవని ఇలాంటి ప్రభుత్వాన్ని సాగనంపే రోజులు దగ్గర్లో ఉన్నాయని ప్రజలు అనుకుంటున్నారు.

- Advertisement -

రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా బీఆర్‌ఎస్‌ నాయకుల అవినీతి అరాచకాలే
తెలంగాణ రాష్ట్రంలో ఏ ఊర్లో చూసిన బీఆర్‌ఎస్‌ నాయకుల అక్రమాలు, అరాచకాలు, అవినీతి, దౌర్జన్యాలు.. వీరి అరాచకాలకు ముగింపు పలికే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ప్రజాస్వామ్య పాలనలో ఇలాంటి వ్యక్తులు, శక్తులు చాలా రోజులు కొనసాగరని వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రజలు అంటున్నారు. ఎక్కడ చూసినా మట్టి మాఫియా, మైనింగ్‌ మాఫియా, ఇసుక మాఫియా, భూదోపిడిలు, కబ్జాలు బెదిరింపులు వినకపోతే కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వంలో కొనసాగుతున్నాయని ప్రజలకు అర్థమైంది.

ఢిల్లీ గులాంలో ఎవరో ప్రజలకు తెలుసు దొర
తెలంగాణ ఆత్మగౌరవం అని చెప్పుకునే కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణను ఢిల్లీ పెద్దల దగ్గర పెట్టిన సందర్భాలు ప్రజలకు గుర్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఇస్తే బీఆర్‌ఎస్‌ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తానని చెప్పి మోసం చేసిన ఘనత ఎవరిదో అందరికీ తెలుసు కుటుంబంతో సహా వెళ్లి సోనియాగాంధీ కాళ్లు మొక్కిన రోజులు మర్చిపోయి మాట్లాడుతున్నారని, అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే నువ్వా ఇతర పార్టీలను విమర్శించేది. ముందు ఢిల్లీ పెద్దల ముందు గులాంగిరి అని అంటావు.. కానీ గులాంగిరి చేస్తున్నది నువ్వే కదా దొర.. ఎన్నో సందర్భాల్లో ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దల కాళ్లపై పడిన మీరా.. మాట్లాడేది అని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. మాటికి ముందు తెలంగాణ ఆత్మగౌరవం అంటూ మాట్లాడే మీరు ఢిల్లీ పెద్దల దగ్గర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన మీరు గులాం గిరి అనే పదాన్ని ఉచ్చరించే అర్హత నీకుందా సారు అంటూ.. ప్రజలు అడుగుతున్నారు. మనది ప్రాంతీయ పార్టీ అంటున్న కేసీఆర్ మరి భారత రాష్ట్ర సమితి అని జాతీయ పార్టీగా మార్చాడెందుకు ఆయనకే తెలియాలి. ఎన్నికలు వస్తే ప్రాంతీయ పార్టీ.. ఎన్నికల లేనప్పుడు జాతీయ పార్టీ ప్రజలు గమనిస్తున్నారు దొర.

విపక్షాలపై విమర్శలే, తానేమి వెలగపెటింది చెప్పడు..
నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ప్రజలకు నమ్మరు.. అబద్ధాలేంటో, నిజాలేంటో వారికి అర్థమవుతున్నాయి దొర. విపక్షాలపై విమర్శలే తప్ప తామేమి తెలంగాణకు వెలుగబెట్టారు. ఎన్నికల్లో తానేది చెప్తే ప్రజలు అదే నిజమనుకుంటారనే భ్రమల్లో కేసీఆర్ ఉన్నారని ఈ పదేళ్ల నుండి ఎన్నికలు వస్తే ప్రతిపక్షాలను విమర్శించడం, ఢిల్లీ వాళ్ళు అవసరమా అని అనడం, ప్రజలను రెచ్చగొట్టడం తప్ప తాను తెలంగాణ ప్రజలకు ఏలాంటి పాలనను అందిస్తున్నారని ఒకసారి ఆలోచించాలని ప్రజలు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం చేస్తున్నది అవినీతి పాలన అని. ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే ఎక్కడ కూడా వారిని ఖండించిన పాపాన పోలేదు. అంటే ప్రతిపక్షాలు అంటున్నట్లు కేసీఆర్ కుటుంబం అవినీతి చేసిందన్నమాట, ప్రజలకు తెలిసిపోయింది దొర ఇక నీ పాలన.. సాలు దొర.. సెలవు దొర అని అంటున్నారు. ప్రతిపక్షాల మీద బురద జల్లడం మానుకొని నీ దారి నీవు చూసుకో అని తెలంగాణ ప్రజలు సూచిస్తున్నారు.

ప్రజలు అండగా ఉన్నారనే భ్రమల్లో బీఆర్‌ఎస్‌..
తెలంగాణలో ఎన్నికల ప్రచారాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు.. దీనిని చూసి బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రజలు మాకు అండదండగా ఉన్నారనే భ్రమల్లో ఉన్నారు. కానీ ప్రజల మనోగతం ఇలా ఉంది.. ఎవరిని టచ్‌ చేసిన పైసలిస్తారు కనుక సమావేశాలకు వస్తున్నాం.. కానీ ఓటు ఎవరికి వేయాలో మాకు తెలుసు.. అంటూ ప్రజల్లో నుంచి ఒక కొత్త మాట వినబడుతుంది. బీఆర్‌ఎస్‌ నాయకులు మాత్రం వాపును చూసి బలుపు అనుకుంటున్నారు. కానీ ప్రజలు ఎన్నికల్లో ఎవరికి కర్రు కాల్చి వాత పెట్టాలో మాకు తేలుసంటూ బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు