Friday, May 17, 2024

రౌడీలపై పోలీస్‌ నజర్‌..

తప్పక చదవండి
  • నేరస్థులకు పోలీసుల మర్దన..
  • ఠాణాలకు పిలిచి కౌన్సిలింగ్‌..
  • ఎన్నికల నేపథ్యంలో కఠినంగా వ్యవహరిస్తున్న పోలీసులు…

(ప్రత్యేక ప్రతినిధి సయ్యద్‌ హాజీ)

హైదరాబాద్ : కరుడు గట్టిన రౌడీషీటర్లు, గ్యాంగ్‌స్టర్లు, వీరు కన్పిస్తే చాలు నగర పోలీసులు రెచ్చిపోతున్నారు… వారిని పోలీస్‌ స్టేషన్లకు పిలిపించి మర్ధన చేసి పంపుతున్నారు. ఇంతేకాదు రాత్రి 10గంటలు దాటితే ఇంట్లో ఉండాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. వారుంటున్నారో లేదో పరిశీలించేందుకు స్వయంగా ఎస్‌ఐ స్థాయి అధికారి వెళ్తున్నారు.. ఇంట్లో ఉన్నాడని నిర్ధారించుకున్నాకే సంతృప్తి చెందుతున్నారు. రౌడిషీటర్లపై ఒకే సారి పోలీసులు వైఖరి మారడం వేనుక రానున్న ఎన్నికలు.. వరస పండగలు.. కొన్ని రోజుల క్రీతం సౌత్, ఈస్ట్‌ డివిజన్‌ ఠాణా పరిధిలో జరిగిన మర్దర్లు కారణంగా కన్పిస్తోంది. అంతే కాకుండా స్థానిక రౌడిషీటర్ల ఆగడాలు భరించలేని ప్రజలు నేరుగా పై అధికారులకు ఫిర్యాదు చేయడమే కాక, వారి ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నగర పోలీసు కమిషనర్‌ సందిప్‌ శాండిలయ్య, రౌడిషీటర్లపై కఠినంగా వ్యవహారించాలని గట్టిగా హెచ్చరించారు. రానున్న రోజుల్లో శాసన సభ ఎన్నికలు ఉన్నందున రౌడీషీటర్ల ఆగడాలకు చెక్‌ పెట్టాలని ఆదేశించారు. జోన్ల, డివిజన్ల, వారిగా ముందస్తు చర్య చేపట్టాలని సూచించారు. వీటితోపాటు నగర కోత్వాల్‌ సందీప్‌ శాండిల్య దక్షిణ మండల పరిధిలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడం, ఇక్కడి స్టేషన్‌ ఇన్‌ స్పెక్టర్లను కేసు వివరాలను అడిగి తెలుసుకుంటూ పలు సూచనలు అందిస్తున్నారు.

- Advertisement -

రౌడీషీటర్లపై పోలీసుల నజర్‌..
హైదరాబాద్‌ నగరంలో రౌడీషీటర్లు, గ్యాంగ్‌స్టర్లపై పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించనున్నారు. ఇప్పటి వరకు కొంతమంది మాత్రమే రౌడీషీటర్ల దందాలు నిర్వహిస్తున్నారన్న భావనతో ఉన్న పోలీసు అధికారులు సాధారణ ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారన్న విషయం దృష్టిలోకి రావడంతో హీస్టరి, షీటర్ల వివరాలను సేకరించారు. రౌడీ షీటర్లు అధికంగా ఉన్న వెస్ట్‌ జోన్‌, సౌత్‌జోన్‌, ఈస్ట్‌జోన్‌, మండల పరిధిలో కార్యకలాపాలు కొనసాగిస్తున్న బడా రౌడీషీటర్ల జైలులో ఉన్నా, వారి అనుచరులపై దృష్టి సారించగా ఇందులో కొంతమంది నగరం నుంచి పారిపోయారు. మరికొంతమంది జైలు జీవితం గడుపుతున్నారు. అయితే వీరి అనుచరులు మాత్రం స్థానికంగా సెటిల్మెంట్లు చేస్తున్నారని వినికిడి.. పోలీసుల నిఘా అంతంత మాత్రంగా ఉండడంతో భౌతిక దాడులకు పాల్పడి బెదిరిస్తున్నారు. దీంతో బాదితులు వారు అడిగినంత మొత్తాన్ని ఇస్తున్నారు. పచ్చిమ మండలం, దక్షిణ మండలం పరిధిలోని కీలక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కొందరు రౌడీషీటర్ల పోలీసులకు ఏ మాత్రం లెక్కచేయడం లేదు.. వివాదాల్లో ఉన్న స్థలాలను గుర్తించి వాటిని బలవంతగా స్వాధీనం చేసుకుంటున్నారని వినికిడి. స్థలాలతో పాటు ఇతర వ్యాపారాలు, ఇతర వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకుంటున్నారు. అయితే రౌడీషీటర్ల ఆగడాలు పెరిగిన విషయంపై అధికారులకు తెలిసిన వెంటనే వారిని స్టేషన్‌కు పిలిచి మర్ధన చేసి పంపుతున్నారు.

ధౌర్జన్యాలపై పోలీస్‌ నిఘా..
రౌడీషీటర్ల ధౌర్జన్యాలపై పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. ఎలాంటి ధౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్న అంశాలపై సమాచారం సేకరిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు వారు ఎక్కడ ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గోంటున్నారు..? వారి అనుచరులు చేస్తున్న పనులపై దృష్టి సారించారు. రాజకీయ నేపథ్యం ఉన్న రౌడీషీటర్లు చేస్తున్న సెటిల్మెంట్ల వివరాలను తెప్చించుకుంటున్నారు. రౌడీషీటర్ల అనుచరులు ప్రధానంగా రాత్రి సమయంలో ఎక్కడ ఉంటున్నారో గుర్తించి, వారిని సమీప పోలీస్‌ స్టేషన్లకు పిలిచి కౌన్సిలింగ్‌ చేసి పంపుతున్నారు. రౌడీషీటర్ల ధౌర్జన్యాలు ఎక్కువగా ఉన్న సౌత్‌, ఈస్ట్‌, సౌత్‌ వెస్ట్‌ మండలంలోని రౌడీషీటర్లను ఠాణాలకు పిలిపించి హెచ్చరిస్తున్నారు. రాత్రి 10 గంటలు దాటాక రోడ్లపై కన్పించకుడదంటూ ఆదేశిస్తున్నారు. ఇంట్లో ఉండక పోతే రాత్రంతా జైలులో పడుకోవాల్సి ఉంటుందని హుకుం జారీ చేస్తున్నారు. రానున్న ఎన్నికల పండగ నేపథ్యంలో శాంతి భద్రతల పరంగా ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు .జరక్కుండా ఈ చర్యలు చేపట్టామని పోలీసులు పేర్కొంటున్నారు..

దక్షిణ మండల డీసీపీ సాయి చైతన్య..:
దక్షిణ మండల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందు జాగ్రత చర్యలు అన్నీ చేపడుతున్నామని, అంతే కాకుండా రౌడీషీటర్లను బైండోవర్ చేయడం, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే.. ఏట్టి పరిస్థితుల్లో సహించేదిలేదని ఆయన స్పష్టం చేశారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని, న్యాయస్థానం ముందు హాజరు పరిచి వారిని జైలుకు తరలిస్తున్నామని ఆయన పేర్కోన్నారు.

సౌత్, ఈస్ట్‌ జోన్‌ డీసీపీ బి.రోహిత్‌ రాజు..:
సౌత్‌ ఈస్ట్‌ డివిజన్‌ పరిధిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, డివిజన్‌లో అత్యంత కీలక మైన చాంద్రాయణగుట్ట, బండ్లగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రౌడీషీటర్ల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి, వారి ఆటలు కట్టడి చేస్తున్నాం. ముందస్తు జాగ్రతగా వారిని ఎన్నికల నియమ, నిబంధనలు అతిక్రమించకుండా బైడోవర్ చేస్తున్నాం.. ఇప్పటికే రౌటీషీటర్లను స్టేషన్లకు పిలిచి కౌన్సిలింగ్‌ చేయడం జరిగింది. రాత్రి సమయంలో గస్తీని పెంచాం. వీటితోపాటు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు