Sunday, May 19, 2024

అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్..

తప్పక చదవండి

ఆరు గ్యారెంటీలను ఇస్తుంది కాంగ్రెస్

  • కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సింగపురం ఇందిర..

జనగామ : బుధవారం రోజు వేలేరు మండల పరిధిలోని, మల్లికుదురుల్ల, గుండ్ల సాగరం గ్రామాలలో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సింగపురం ఇందిర.. అనంతరం కార్యకర్తలు, గ్రామ ప్రజలు ఉద్దేశించి మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్.. ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని.. ఆ 6 గ్యారెంటీ పథకాలను ప్రజలకు వివరించడం జరిగినది..

- Advertisement -

కాంగ్రెస్ గ్యారంటీ కార్డు :

1) మహాలక్ష్మి పథకం :
మహిళలకు ప్రతీ నెల ₹2500, 
కేవలం రూ. 500 కే వంట గ్యాస్ సిలిండర్,
ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచిత ప్రయాణం.

2) రైతు భరోసా పథకం :
ప్రతీ ఏటా రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి ఏడాదికి రూ. 15,000. రూ. 12,000 వ్యవసాయ కూలీలకు. వరి పంటకు క్వింటాల్ కు
రూ. 500 బోనస్.

3) గృహ జ్యోతి పథకం :
ప్రతి కుటుంబానికి ప్రతీ నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్. 

4) ఇందిరమ్మ ఇళ్లు పథకం :
ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు. ఉద్యమకారులకు 250 చ.గ ఇంటి స్థలం.

5) యువ వికాసం పథకం :
విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు. ప్రతీ మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్. 

6) చేయూత :
వృద్ధులు వితంతువులు వికలాంగులు బీడీ కార్మికులు ఒంటరి మహిళలు కల్లుగీత కార్మికులు నేత కార్మికులు ఎయిడ్స్, ఫైలేరియా బాధితులకు నెలకు రూ.4,000 పింఛన్.. పేదలకు 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ భీమా.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, మండల అనుబంధ సంఘాల అధ్యక్షులు, యువజన నాయకులు, మహిళా నాయకురాళ్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు