Saturday, July 27, 2024

ఢిల్లీలో చైనా న్యుమోనియా తరహా కేసులు!

తప్పక చదవండి
  • చైనాను కలవరపెడుతున్న మైకోప్లాస్మా న్యుమోనియా
  • ఢిల్లీ ఎయిమ్స్‌లో వెలుగు చూసిన ఏడు కేసులు!
  • కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ప్రకటన
  • చైనాను కలవరపెడుతున్న న్యుమోనియా

చైనాలో అంతుచిక్కని న్యుమోనియా పసిపిల్లలను బాగా ఇబ్బంది పెడుతోంది. ఈ లక్షణాలతో పెద్దసంఖ్యలో చిన్నారులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సైతం ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ప్రజారోగ్యం, ఆస్పత్రుల సన్నద్ధతపై పలు కీలక సూచనలు చేసింది. అయితే ఈ సమయంలోనే.. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చైనా న్యుమోనియా తరహా కేసులు బయటపడ్డాయంటూ మీడియాలో వచ్చిన కథనాలు దేశ ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. కొవిడ్ మహమ్మారి కారణంగా శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా బాగా దెబ్బతిన్న ప్రజానీకం.. న్యుమోనియా కేసులు ఇండియాలోనూ నమోదయ్యాయన్న వార్తలతో కంగారు పడిపోయారు. అయితే ఈ వార్తలకు కేంద్రం చెక్ పెట్టింది. ఢిల్లీ ఎయిమ్స్‌లో నమోదైన కేసులు చైనాలో వెలుగుచూసిన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లతో ముడిపడి ఉన్నాయనే వార్తా కథనాలను కేంద్రం కొట్టిపారేసింది. ఇవి పూర్తిగా తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయంటూ కేంద్ర ఆరోగ్యశాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఎయిమ్స్‌లో వెలుగు చూసిన ఏడుకేసులకు చైనాతో సహా ప్రపంచవ్యాప్తంగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల పెరుగుదలకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటనలో పేర్కొంది. 2023 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య ఢిల్లీ ఎయిమ్స్‌లో నమోదైన ఏడు కేసులతో ఎలాంటి భయం అవసరం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు