Thursday, May 16, 2024

సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ ను గెలిపిస్తాయి

తప్పక చదవండి
  • బీజేపీ, కాంగ్రెస్ ను నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజానీకం లేరు
  • కేసీఆర్ తెలంగాణను, యాదాద్రిని ఎంతో అభివృద్ధి చేశారు
  • ఈ అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ అధికారం చేపట్టాలి
  • మరోసారి అవకాశం ఇవ్వండి ఆలేరును మరింతగా అభివృద్ధి చేస్తాం

హైదరాబాద్ : సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ ను మళ్ళీ అధికారంలోకి తెస్తాయని ఆలేరు సిట్టింగ్ ఎమ్మెల్యే గొంగిడి సునీత మరోసారి స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ లు లెక్కలేనన్ని నెరవేర్చడానికి వీలుకాని .. ఆచరణ సాధ్యం కానీ హామీలెన్నో ఇబ్బడి మొబ్బిడిగా ప్రచారం చేసుకుంటూ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని వారి మాయమాటలు నమ్మి మోసపోకూడదని ఆమెసూచించారు. తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న బీఆర్ఎస్ ను తప్ప మరో పార్టీని నమ్మే స్థితిలో లేరని ఆమె అన్నారు. తెలంగాణ సాధించుకున్నాక రాష్ట్రం అనేక రంగాల్లో ఘనమైన అభివృద్ధి సాధించిందని ముఖ్యంగా యాదాద్రి దేవాలయం తిరుపతి తరహాలో అభివృద్ధి సాధించిందని ఆమె అన్నారు. పలు రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి పెరుగుతున్న వలసలు దీనికి నిదర్శనమని ఆమె అన్నారు. నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పాటుబడే నాయకులు చరిత్రలో అరుదుగా ఉంటారని.. అలంటి నాయకుల్లో ఒకరిగా కేసీఆర్ చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయారని సునీత పేర్కొన్నారు. వారికి మనమిచ్చే నిజమైన గౌరవం తమ విలువైన, అమూల్యమైన ఓటును వేసి అధికారం చేపట్టమని కోరడమేనని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో,యాదాద్రి జిల్లాలో ఇలాగె అభివృద్ధి నిర్వీరంగా కొనసాగాలంటే కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆమె పిలుపునిచ్చారు.

మూడోసారి సునీత గెలిస్తే మంత్రి పదవి ఖాయమా ..?
మూడోసారి సునీత ఆలేరు అభ్యర్థిగా విజయం సాధిస్తే ఆమెకు మంత్రి పదవి ఖాయమన్న సంకేతాలు బీఆర్ఎస్ వర్గాల్లో వినబడుతున్నాయి.ఈ మేరకు ఆలేరు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులు ఈ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆలేరు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గొంగిడి సునీత మహేందర్ రెడ్డిని ముచ్చటగా మూడవసారి గెలిపించి మంత్రి హోదాలో చూద్దాం అంటూ వైయస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు ఎర్ర సోమిరెడ్డి ఆధ్వర్యంలో లింగరాజుపల్లి గ్రామంలో ఇంటి ఇంటికి తిరుగుతు కారు గుర్తుకు ఓట్లు వెయ్యాలని ప్రచారం నిర్వహించారు . ముఖ్యమంత్రిగా కేసిఆర్ ఉంటేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని వారు ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ ఆధ్వర్యంలో ఆలేరు నియోజకవర్గం ఎంతో అభివృద్ధి ప్రగతి సాధించిందని నాయకులు పేర్కొన్నారు. ఆలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సహకారం తో సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందుతున్నాయని.. ఈ అభివృద్ధిలో ఇలాగె కొనసాగాలంటే మళ్ళీ సునీత మహేందర్ రెడ్డిని గెలిపించుకోవాలి నాయకులు ప్రచారం చేస్తున్నారు.. అయితే బిఆర్ఎస్ నాయకుల ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది..మళ్ళీ సునీత కే పట్టం కట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

మేం అప్పుడు,ఇప్పుడు, ఎప్పుడు చేయగలిగే వాగ్దానాలు చేశాం-సునీత
కేవలం అధికారంలోకి రావడమే పరమావధిగా పెట్టుకుని నెరవేర్చడానికి సాధ్యం కానీ హామీలని బిఆర్ఎస్ ప్రకటించలేదని ఆలేరు సిట్టింగ్ ఎమ్మెల్యే గొంగిడి సునీత పేర్కొన్నారు. మేం అప్పుడు,ఇప్పుడు, ఎప్పుడు చేయగలిగే వాగ్దానాలు మాత్రమే ప్రజలకు చెప్పామని ఆమె అన్నారు. బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని రైతులకు రైతుబంధు రూ.16 వేలు వరకు పెంచుతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని సునీత పేర్కొన్నారు.ఆసరా పెన్షన్ లలో బీఆర్ఎస్ ప్రభుత్వం గణనీయమైన వృద్ధిని సాధించిందని ఆమె అన్నారు , ఐదేళ్ల వ్యవధిలో రూ.2016 నుండి రూ.5016కి పెంచనున్నట్లు తెలియజేసారు. సౌభాగ్యలక్ష్మి పథకం అర్హులైన మహిళలకు నెలవారీ 1000 రూపాయల స్టైఫండ్‌ను అందించనున్నట్లు సునీత తెలిపారు. . తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉన్న ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించారు. దివ్యాంగుల పెన్షన్లు రూ.4016 నుంచి రూ.6 వేలకు పెంచుతామని అన్నారు . ప్రతి ఏటా రూ.300 చొప్పున పెంచుతాం అని ముఖ్యమంత్రి మ్యానిఫెస్టోలో తెలిపారని సునీత తెలిపారు. .కెసిఆర్ భీమా ప్రతీ ఇంటికి ధీమా రూ.5,00,000 అందేలా చూస్తామని అన్నారు. తెలంగాణ అన్నపూర్ణ పథకం పేరీట తెల్ల రేషన్ కార్డున్న ప్రతీ ఇంటికి సన్న బియ్యం అందేలా చూస్తామని అన్నారు.సౌభాగ్యలక్ష్మి స్కీం కింద మహిళలకు గౌరవ బృతి నెలకి 3000 బీపీఎల్ కార్డ్ ఉన్న అర్హులైన మహిళలకు ,వర్కింగ్ జర్నలిస్ట్స్ లకి 400 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తామని అన్నారు. ప్రజా సంక్షేమం కోసం నిత్యం పరితపించే కేసీఆర్ లాంటి నాయకుడికి ముచ్చటగా మూడోసారి అవకాశం కల్పించాలని ఆమె ఆలేరు ప్రజానీకాకి విజ్ఞప్తి చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు