Thursday, May 16, 2024

నేడు బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో

తప్పక చదవండి
  • కాంగ్రెస్‌ గ్యారెంటీలు, బీజేపీ హామీలను తలదన్నేలా మేనిఫెస్టో!
  • ఇప్పటికే అమలవుతోన్న పథకాలు కొనసాగించే అవకాశం
  • దిగువ, మధ్యతరగతి కుటుంబాలకై కొత్త పథకాలు ప్రకటించే అవకాశం
  • హుస్నాబాద్‌ సభతో సమరశంఖారావానికి సిద్ధం

హైదరాబాద్‌ : తెలంగాణలో రాజకీయం కాకరేపుతోంది. ఇప్పటివరకూ ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్టు మారిపోయింది పొలిటికల్‌ సీన్‌. ఎన్నికల షెడ్యూల్‌ అలా విడుదలయ్యిందో లేదో ఒక్కసారిగా స్పీడ్‌ పెంచేశాయ్‌ పార్టీలు. గెలుపే లక్ష్యంగా దూకుడు రెట్టింపు చేశాయ్‌. కాంగ్రెస్‌, బీజేపీతో పోలిస్తే అధికార పార్టీ బీఆర్‌ఎస్సే స్పీడుమీదుంది. ఎలక్షన్‌ షెడ్యూల్‌ రాకముందు నుంచే కేటీఆర్‌ జిల్లాలను చుట్టేస్తుంటే, ఆదివారం నుంచి రంగంలోకి దిగుతున్నారు గులాబీ బాస్‌. అక్టోబర్‌ 15వ తేదీన బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను ప్రకటించడమే కాకుండా హుస్నాబాద్‌ సభతో సమరశంఖం పూరించేందుకు రెడీ అవుతున్నారు కేసీఆర్‌. కాంగ్రెస్‌ గ్యారెంటీలు, బీజేపీ హామీలను తలదన్నేలా బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో ఉండబోతోందంటూ ఇప్పటికే లీకులిచ్చారు కేటీఆర్‌. ఈసారి మేనిఫెస్టో సరికొత్తగా, ఆసక్తికరంగా ఉంటుందంటూ చెప్పుకొస్తున్నారు. అయితే, బీఆర్‌ఎస్‌ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం ఇప్పటికే అమలవుతోన్న పథకాలు కొనసా గించడం, వాటి పరిధిని పెంచబోతున్నట్టు తెలుస్తోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఈ నెల 15న జరిగే సీఎం కేసీఆర్‌ ప్రజా ఆశీర్వాద సభ పనులు శరవేగంగా జరుగుతున్నాయని స్థానిక ఎమ్మెల్యే సతీష్‌ కుమార్‌ తెలిపారు. ఇప్పటికే హెలిప్యాడ్‌ నిర్మాణం పూర్తయిందని, సభాస్థలి వేదిక పనులు రేపటి వరకు పూర్తవుతా యన్నారు. సీఎం కేసీఆర్‌ సభాస్థలంలో జరుగుతున్న ఏర్పాట్లను పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే సతీష్‌ కుమార్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హుస్నా బాద్‌ నియోజకవర్గం సీఎం కేసీఆర్‌కు లక్ష్మీ నియోజకవర్గమని, గతంలో 2014 ,2018 రెండుసార్లు హుస్నాబాద్‌ నుండి కేసీఆర్‌ ఎన్నికల ప్రచా రాన్ని బహిరంగ సభ ద్వారా ప్రారంభించారని గుర్తు చేశారు. మూడో సారి హ్యాట్రిక్‌ దిశగా దూసుకుపోతూ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం ప్రభంజనం సృష్టించబోతుం దన్నారు. బహిరంగ సభ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయని మహిళలకు, వికలాంగులకు ప్రత్యేకమైన గాలరీలు ఏర్పాటు చేశామని, సభలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటు న్నామని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని కోరారు. కాగా కేసీఆర్‌ అంటే జనసునామీ. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్‌ ప్రసంగాలకు మైమరిచిపోని వారు లేరు. ఆయన ప్రసంగాలకు విపక్ష నేతలే అబ్బుపరడతారు. రెండు పర్యా యాలు జనరంజక పాలన అందించిన సీఎం కేసీఆర్‌కు మాత్రమే తెలంగాణ ప్రజలకు ఏం కావాలో తెలుసని అన్ని రాజకీయ పార్టీల్లోని కొందరు నేతల అభిప్రాయం. ‘మా వాళ్ల కంటే కేసీఆర్‌ 30-40 ఏండ్లు ముందుంటారు. కేసీఆర్‌ను పట్టుకోవటం.. అంచనా వేయటం అసాధ్యమైన విషయం. కేసీఆర్‌ అమ్ములపొది లో ఉండే అస్త్రాలు, వాటికి వచ్చే జనామోదం మేము ఇప్పుడు కాదు ఉద్యమకాలం నుంచి చూస్తూనే ఉన్నాం. కేసీఆర్‌ను తట్టు కోవటం కష్టం’ అని కాంగ్రెస్‌లోని తలపండిన ఓ సీనియర్‌ నేత ఇటీవల వారి పార్టీ ముఖ్యనేతల సమావేశంలోనే కుండబద్దలు కొట్టారట. ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన మాటకు కేసీఆర్‌ ఏ స్థాయిలో విలువ ఇచ్చి దాన్ని అమలు చేసేందుకు ఎంత వరకైనా వెళతాడని సదరు నేత విశ్లేషించిన తీరుపై ఆ పార్టీలో ముసలం బయలుదేరిందని విస్తృత ప్రచారం సాగుతున్నది. సీఎం కేసీఆర్‌ వ్యూహాన్ని అంచనా వేయటం విపక్షాలకు అంతుచిక్కదని మరోసారి స్పష్టమైంది. తెలంగాణ ఉద్యమ సమయంలోనే కాదు తొమ్మిదిన్నరేండ్ల పాలనలో చేపట్టిన విప్లవాత్మక చర్యలు ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకొచ్చాయి. 2014, 2018 ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ అనుసరించిన ప్రచార వ్యూహాన్నే ఈసారి ఆచరించనున్నారు. ప్రచార షెడ్యూల్‌ ఖరారు కావటంతో బీఆర్‌ఎస్‌లో జోష్‌ నెలకొన్నది. పార్టీ కార్యకర్తలు, నాయకులను ఎన్నికల స మరానికి సమాయత్తం చేయటంలో మంత్రుల పర్యటనలు తోడ్పాటును అందించాయి. ఎన్నికల షెడ్యూ ల్‌ విడుదల కావడంతో ప్రజలను పూర్తిగా బీఆర్‌ఎస్‌వైపు మళ్లించేందుకు కేసీఆర్‌ తనదైన వ్యూహం తో ఎన్నికల కదనరంగంలోకి అడుగిడబోతున్నారు. కేసీఆర్‌ 2014 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చారు. కాంగ్రెస్‌ నేతల విషప్రచారంతో ఆయన 2018లో ప్రభుత్వాన్ని 7 నెలల ముందే రద్దు చేసి ప్రజల ముందుకు వెళ్లారు. ఎవరెన్ని చెప్పినా తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ వెంటే ఉన్నారని రెండు ఎన్నికలు నిరూపించాయి. ఇప్పుడూ అదే చరిత్ర పునరావృతం అవుతుందని బీఆర్‌ఎస్‌ సహా కాంగ్రెస్‌ పార్టీలోని అసలైన తెలం గాణవాదులు తమ ప్రయివేట్‌ చర్చల్లో విశ్లేషిస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలో ఆయన సరిగ్గా 15 రోజుల ముందు ప్రచా రాన్ని ప్రారంభించారు. కేవలం 11 రోజుల వ్యవధిలోనే 107 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సభలు నిర్వహించి రికార్డు సృష్టిం చారు. అలాగే 2018 ఎన్నికల సమ యంలో 87 సభలు నిర్వ హించారు. 2018 ఎన్నికల్లో సమయం లో ఒక రోజు (నవంబర్‌ 26, 2018వ తేదీన) 15 నియోజక వర్గాలను కవర్‌చేస్తూ 9 బహిరంగ సభల్లో పాల్గొని చేసిన ప్రసంగం దేశ ఎన్నికల చరిత్రలో రికార్డు సృష్టించింది. ఈ నెల 15 నుంచి సీఎం కేసీఆర్‌ ప్రారంభిం చే ఎన్నికల ప్రచారాన్ని తొలి విడతగా 17 రోజులపాటు బీఆర్‌ఎస్‌ పార్టీ ఖరారు చేసింది. 17 రోజుల్లో 42 నియోజకవర్గాలు కవరవు తున్నాయి. ఇందులో గజ్వేల్‌ మినహా మిగితా 41 నియోజకవర్గా ల్లో ఎన్నికల ప్రచార సభల్లో కేసీఆర్‌ పాల్గొనబోతున్నారు. నిన్న మొన్నటిదాకా కేసీఆర్‌పై ఆరోపణలు చేసిన వారికి, ప్రత్యేకించి ఆయన ఆరోగ్యంపైనా ఇష్టారీతిగా మాట్లాడినవారికి ఈ షెడ్యూల్‌ చూసి మైండ్‌ బ్లాంక్‌ అవుతుందని బీఆర్‌ఎస్‌ నేతలు అంటున్నారు. విపక్షాలు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయకముందే తాము తొలి దశ ప్రచారం పూర్తి చేశామని బీఆర్‌ఎస్‌ నేతలు అంటున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు