Wednesday, May 15, 2024

ప్రజల కొంప ముంచిన చేపల పులుసు

తప్పక చదవండి
  • 575 టీఎంసీల నీళ్లు రావాల్సి ఉండగా 299 టీఎంసీలకే సంతకం
  • అపెక్స్‌ కౌన్సిల్‌ మీటింగ్‌లోనే కేసీఆర్‌ను నిలదీసిన మాట నిజం కాదా?
  • మోటార్లకు మీటర్లు, సింగరేణి ప్రైవేటీకరణ ఒట్టి బూటకం
  • కేసీఆర్‌ మోసాలకు బుద్ది చెప్పే టైమొచ్చింది
  • బీఆర్‌ఎస్‌ను ఓడిరచండి… కేసీఆర్‌కు ఓటమిని గిఫ్ట్‌గా ఇవ్వండి
  • తెలంగాణ రైతులకు న్యాయం చేసేది బీజేపీ పార్టీనే..
  • బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌

హైదరాబాద్ : కృష్ణా జలాల వాటా విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ కనబర్చిన తీరుపై బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌ లో బీజేపీ ఆధ్వర్యంలో శనివారం రైతు సదస్సు నిర్వహించారు. ట్రిబ్యునల్‌ అంటే వెదిరే శ్రీరామ్‌ గుర్తుకు వస్తారని అన్నారు. రెండు రాష్ట్రాలు బాగుండాలని కోరుకునే వ్యక్తి అని తెలిపారు. తెలంగాణ ప్రజల కొంప ముంచింది మొత్తం చేపల పులుసే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చేస్తే సంసారం.. ఇతరులు చేస్తే వ్యభిచారం ఇది.. కేసీఆర్‌ తీరు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ సమయంలోనే ప్రజలను మోసం చేశారన్నారు. దక్షిణ తెలంగాణ ప్రజలను మొత్తం ముంచారని తెలిపారు. విభజన సమయంలోనే కేసీఆర్‌.. పైసలు, కమీషన్లకు లాలూచీ పడి కేవలం 570 టీఎంసీలకు బదులు 292 టీఎంసీలకు సంతకం పెట్టాడని అన్నారు. ఆపై 9 ఏండ్లు కేంద్రానికి ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలని లేఖ రాశారు. కానీ కేంద్రం నుంచి వచ్చిన రిప్లై గురించి మాత్రం ఎవరికీ చెప్పలేదన్నారు. ఈయన ఇలా చేస్తున్నాడని అపెక్స్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేస్తే గైర్హాజరయ్యారని తెలిపారు. ఎన్నికల టైమొచ్చింది. పోలింగ్‌ రోజున చేపల పులుసును గుర్తుకు తెచ్చుకోండి. పళ్లు (దంతాలు) పటపట కొరకండి. ఓటుతో కేసీఆర్‌కు బుద్ది చెప్పండి. ఓటమిని గిఫ్ట్‌ గా ఇవ్వండి’’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘‘రైతు సదస్సు’’కు హాజరైన బండి సంజయ్‌ సీఎం కేసీఆర్‌పై ఫైర్‌ అయ్యారు.

క్రిష్ణా జలాల వాటా, వివాదాల పరిష్కారం కోసం ట్రిబ్యునల్‌ ఏర్పాటును స్వాగతిస్తూ రైతు సదస్సును ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని.. ట్రిబ్యునల్‌ ఏర్పాటు కోసం అలుపెరగని కృషి చేశామన్నారు. క్రిష్ణా నీటి వాటాలో తెలంగాణకు కొంప ముంచింది చేపల పులుసేనని.. రాయలసీమలో కేసీఆర్‌కు పెట్టిన చేపల పులుసేనని కామెంట్స్‌ చేశారు. కేసీఆర్‌ది అంతా తాను చేస్తే సంసారం.. ఇతరులు చేస్తే వ్యభిచారం అని ప్రచారం చేసుకుంటారని మండిపడ్డారు. ‘‘తెలంగాణకు నీటి కేటాయింపులో తీరని ద్రోహం చేసిన వ్యక్తి సీఎం కేసీఆర్‌. విభజన సమయంలోనే తెలంగాణకు 575 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా.. ఏపీ సీఎంతో లాలూచీ పడి డబ్బులకు కక్కుర్తిపడి 299 టీఎంసీల నీటికే అంగీకరిస్తూ సంతకం పెట్టిన మూరు?డు కేసీఆర్‌. దానికి సంబంధించిన ఆధారాలన్నీ మా వద్ద ఉన్నాయి. 299 టీఎంసీలకే ఎందుకు ఒప్పుకున్నావని నిలదీస్తే నోరుమెదపని మూరు?డు కేసీఆర్‌. పైగా నీటి కేటాయింపులో కేంద్రం మోసం చేస్తోందంటూ లేఖ పేరుతో ప్రజలను, మీడియాను తప్పుదారి పట్టించిన దుర్మార్గుడు కేసీఆర్‌ నీటి కేటాయింపులు, ట్రిబ్యునల్‌ ఏర్పాటుపై నిర్వహించిన అపెక్స్‌ కౌన్సిల్‌లో నాటి సీఎం చంద్రబాబుతో కుమ్మక్కై 299 టీఎంసీలకే అంగీకరించిన విషయాన్ని బయటపెట్టడంతో నోరు మూసుకున్న వ్యక్తి కేసీఆర్‌. అదే సమయంలో సుప్రీంకోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకుంటేనే ట్రిబ్యునల్‌ ఏర్పాటు సాధ్యమవుతుందని జల్‌ శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ స్పష్టం చేయడంతోపాటు విత్‌ డ్రా చేసుకునేందుకు అంగీకరించిన కేసీఆర్‌ మళ్లీ రెండేళ్ళపాటు నాన్చిన తరువాత గతేడాది పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.
క్రిష్ణా జలాల వివాదాలు, కేటాయింపులపై ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తే కనీసం కేంద్రానికి ధన్యవాదాలు కూడా తెలపని మూర్ఖుడు కేసీఆర్‌. ట్రిబ్యునల్‌ ఏర్పాటు కాకూడదు.. ప్రజలకు మేలు జరగకూడదన్నదే కేసీఆర్‌ ఆలోచన. థ్యాంక్స్‌ చెబితే నీకేమైతుంది..? ముత్యాలేమైనా రాలుతాయా..? మొన్నటికి మొన్న పాలమూరు ప్రాజెక్టులో ఒక మోటార్‌ మాత్రమే ఆన్‌ చేసి 10 లక్షల ఎకరాలకు నీళ్లిస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడు. ప్రపంచంలోనే ఇంతకంటే మోసగాడు ఎవరూ లేరు..’’ అంటూ బండి సంజయ్‌ ఫైర్‌ అయ్యారు. ఎండాకాలం రాకముందే సాగర్‌లో ఒక్క చుక్క నీరు లేదన్నారు. రేపు ఎల్లుండి.. కేసీఆర్‌ బయటకు వస్తారని అన్నారు. రైతు బంధు, ఫ్రీ యూరియా అంటూ అన్ని అబద్ధాలు చెప్తారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ గెలిస్తే.. రైతు బంధు కూడా రాదు.. దాన్ని కేసీఆర్‌ ఆపేయడం ఖాయం మన్నారు. దుబ్బాక, హుజురాబాద్‌ ఎన్నికల్లో మోటార్లకు మీటర్లు పెడతారని అంటే.. అబద్ధాలు చెప్తే నీకే మీటర్‌ పెడతామని హెచ్చరించామని తెలిపారు. నంబర్‌ వన్‌ దొంగ, బట్టేబాజ్‌ కేసీఆర్‌ అంటూ బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మోటార్లకు మీటర్లు అని అంటే ప్రగతి భవన్‌ కు వచ్చి గల్లా పట్టి కొడతాం అంటే.. నోరు ముస్కున్నాడని అన్నారు. రైతులు తలుచుకుంటే.. బీఆరెస్‌ ను గద్దె దింపవచ్చన్నారు. ధాన్యం కొనుగోలులో గోనె సంచి నుంచి కేసీఆర్‌ సర్కార్‌ చేసే బ్రోకర్‌ పర్శంటేజి కూడా కేంద్రం ఇస్తోందన్నారు. ఓటు వేసేందుకు వెళ్లే ముందు ప్రజలకు కేసీఆర్‌ తిన్న చేపల పులుసు గుర్తుకు రావాలి.. పట పట పండ్లు కొరికి కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు