Saturday, May 11, 2024

బెజ్జూరు సహకార సొసైటీలో జరిగిన కోటి రూపాయల అవినీతిలోసిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు వాటా ఉంది..

తప్పక చదవండి
  • తీవ్ర ఆరోపణలు చేసిన డా. పాల్వాయి హరీష్ బాబు..
  • భాజాపా ఆధ్వర్యంలో ధర్నా..

బెజ్జూర్ : మండల కేంద్రంలోని సహకార బ్యాంకు ఎదుట భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శనివారం రోజు ధర్నాను నిర్వహించడం జరిగింది. ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసిన రైతు రుణమాఫీ బెజ్జూర్ సొసైటీలో అమలు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారనే విషయం తెలుసుకొని, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు ఈ ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ.. బెజ్జూరు సహకార సొసైటీ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో జరిగిన కోటి రూపాయల అవినీతిలో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు వాటా ఉందని ఆరోపించారు. పాలక మండలి సభ్యులు, అధికారులు కలిసి రైతుల డబ్బులు కాజేసారని, అందుకే అకౌంట్లను స్తంభింపజేసి రుణమాఫీని అమలు చేయలేకపోతున్నారని తెలిపారు. బెజ్జూర్ సహకార సొసైటీలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని, గతంలో వచ్చిన పంటల భీమా డబ్బులు, పర్సనల్ లోన్ డబ్బుల్ని కూడా కాజేశారని ఆరోపించారు. రెండు నెలల్లో ఏర్పడే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ అవినీతి అనకొండలందరినీ సాగనంపుతామని,అవినీతి సొమ్మును అంతా రికవరీ చేస్తామని, రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

- Advertisement -

వెంటనే కలెక్టర్ చొరవ తీసుకొని సమగ్ర విచారణకు ఆదేశించి, రుణమాఫీని అమలు చేసి, ఈ సహకార సొసైటీలో జరుగుతున్న అవినీతిని బట్టబయలు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్య్రమంలో మాజీ జెడ్పీటీసీ ఎల్ములే మల్లయ్య, మాజీ సింగల్ విండో చైర్మన్ కొండ్ర మనోహర్ గౌడ్, మాజీ ఎంపీపీ కొప్పుల శంకర్, మండల అధ్యక్షులు ఉమ్మెర బాల కృష్ణ, కారెం సతీష్, దుర్గం శోభన్, మాజీ సర్పంచ్ వసి ఉల్లాఖాన్, డుబ్బుల జనార్ధన్, చౌదరి నానయ్య, జాడి దిగంబర్, కోల కిష్టయ్య, బిక్షపతి, సత్పుతే తుకారం, పురుషోత్తం చారి, పవన్ పురోహిత్, కుమ్మరి తిరుపతి, రౌతు భుజంగరావు, రాకేష్, పుల్లబోయిన వెంకటేష్, డోకే మల్లేష్, శ్రీమన్నారాయణ, చాప్లే సత్యనారాయణ, దుర్గం కారు, డుబ్బుల నారాయణా, బషీర్ ఖాన్, మడవి కేశవ రావు, ఎల్కరి సంజీవ్, బేనికి శ్యామ్ సుందర్, మురళి గౌడ్, కొప్పుల దిలీప్, గట్టు తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు