Saturday, May 4, 2024

సంచలన ప్రకటన చేసిన భూపాలపల్లి ఎస్.పీ.

తప్పక చదవండి
  • మేడిగడ్డ ఘటనపై ఎలాంటి కుట్ర కోణం లేదు..
  • ముందు కూడా ఎలాంటి అల్లర్లు జరిగే అవకాశం లేదు..
  • నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారుల బృందం బ్యారేజీని పరిశీలించింది..
  • విచారణ జరిపి ప్రకటన విడుదల చేసిన ఎస్.ఫై. కిరణ్ ఖరే..

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన ఘటనపై భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఒక కీలక ప్రకటన చేశారు. బ్యారేజీ పిల్లర్లు కుంగడం వెనక ఎలాంటి కుట్ర కోణం లేదని ఆయన ఖరాకండిగా చెప్పారు. కాగా, భూపాల‌పల్లి జిల్లాలోని మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజ్ పిల్లర్లు కుంగడంతో నీటిపారుదల శాఖ అధికారి ఇచ్చిన పిటిషన్‌ మేరకు పోలీసులు మహదేవ్‌పూర్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. తదుపరి విచారణలో పిల్లర్లలో పగుళ్లు కనిపించినట్లు గుర్తించామని చెప్పారు.

ఈ అంశంపై అన్ని కోణాల్లో క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని నీటిపారుదల శాఖ ఏఈ కంప్లైంట్ ఇచ్చారని ఆయన తెలిపారు.. పోలీసు బృందాల విచారణ తర్వాత.. ఏదైనా కుట్ర లేదా అల్లర్లు జరిగే అవకాశాన్ని ఎస్పీ తోసిపుచ్చారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారుల బందృం బ్యారేజీని పరిశీలించిదని తెలిపారు. వారు తమ పరిశోధనలను త్వరలో సమర్పించనున్నారని చెప్పారు. నీటిపారుదల శాఖ అభ్యర్థన మేరకు, భద్రతా సమస్య కారణంగా పోలీసులు బ్యారేజ్‌పై వాహనాల రాకపోకలను నిలిపివేశారని పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు