Friday, May 3, 2024

ప్రపంచకప్‌లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌ కి ఫిక్స్ అయిన కొత్త తేదీ..

తప్పక చదవండి

ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15న మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే అక్టోబర్ 15 నుంచి నవరాత్రులు కూడా ప్రారంభమవుతున్నందున భద్రతా సమస్యలు తలెత్తే అవకాశముందని అహ్మదాబాద్ పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే మ్యాచ్‌ను ఒకరోజు ముందుగానే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు.. అయితే అక్టోబర్ 15 నుంచి నవరాత్రులు కూడా ప్రారంభమవుతున్నందున భద్రతా సమస్యలు తలెత్తే అవకాశముందని అహ్మదాబాద్ పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే మ్యాచ్‌ను ఒకరోజు ముందుగానే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు ఇండియా టుడే నివేదించింది. దీని ప్రకారం అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఇండో-పాక్ షెడ్యూల్ మారిన నేపథ్యంలో మిగిలిన కొన్ని మ్యాచ్ ల షెడ్యూల్ లో మార్పు ఉండే అవకాశం ఉంది. ఈ మార్పులతో ఆగస్ట్ 31న కొత్త షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు తెలిసింది. అక్టోబర్ 15 నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా గుజరాత్‌లో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో ఘనంగా గర్బా సంబరాలు ఘనంగా నిర్వహిస్తారు. ఇందుకోసం భారీ స్థాయిలో పోలీస్‌ బందోబస్తు ఏర్పాటుచేస్తారు. అదే సమయంలో అహ్మదాబాద్‌లోని స్టేడియం సామర్థ్యం లక్షకు పైగా ఉంది. ముఖ్యంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కోసం స్టేడియం కిక్కిరిసిపోతుంది. అందువల్ల స్టేడియం చుట్టూ మరింత మంది పోలీసులను మోహరించాలి. గుజరాత్ అంతటా గర్బా కార్యక్రమం నిర్వహిస్తున్నందున అక్కడ కూడా పోలీసులను మోహరించాలి. ఒకే రోజు అన్నిచోట్లా తగిన పోలీసు భద్రత కల్పించడం కష్టమని అహ్మదాబాద్ పోలీసులు తెలిపారు. అందుకే మ్యాచ్‌ తేదీని రీషెడ్యూల్ చేయాలని బీసీసీఐకి వినతి పత్రం సమర్పించారు. అక్టోబరు 14న భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బీసీసీఐ ఇప్పటికే ఐసీసీకి లేఖ రాసింది. దీని ప్రకారం ఆదివారం కాకుండా శనివారం మ్యాచ్ నిర్వహించడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. వన్డే ప్రపంచకప్ అక్టోబర్ 5 నుంచి ప్రారంభమై నవంబర్ 19న ముగుస్తుంది. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. అక్టోబర్ 8న భారత జట్టు తొలి మ్యాచ్ ఆడనుంది. చెన్నై వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడనుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు