Tuesday, April 30, 2024

క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్..

తప్పక చదవండి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్-17 విదేశాల్లో నిర్వహించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలే ఇందుకు ప్రధాన కారణం. అంటే ఐపీఎల్ 2024 సమయంలో భారత్‌లో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, అందుకే ఈ టోర్నీని విదేశాల్లో నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో 2009, 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో విదేశాల్లో ఐపీఎల్‌ను నిర్వహించింది. ఇప్పుడు దీన్ని బట్టి వచ్చే ఐపీఎల్ కూడా విదేశాల్లో జరిగే అవకాశం ఉందని సమాచారం.

బీసీసీఐ ముందున్న అతిపెద్ద సవాలు..
ఓ వైపు భారత్‌లో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనుండగా, మరోవైపు టీ20 ప్రపంచకప్‌నకు తేదీ కూడా ఫిక్స్ అయింది. దీని ప్రకారం జూన్ 4 నుంచి 30 వరకు టీ20 ప్రపంచకప్ జరగనుంది. భారత్‌లో లోక్‌సభ ఎన్నికల తేదీ ఖరారైతే, అంతకంటే ముందే ఐపీఎల్ నిర్వహించాల్సి ఉంటుంది.

- Advertisement -

దీని ప్రకారం మార్చి-మే మధ్య ఐపీఎల్‌ను పూర్తి చేయాల్సిన అవసరం బీసీసీఐకి ఉంది. ఎందుకంటే టీ20 ప్రపంచకప్ 2024 జూన్ నుంచి ప్రారంభం కానుంది. మార్చి లేదా మేలో లోక్‌సభ ఎన్నికలు జరిగితే బీసీసీఐ కష్టాల్లో కూరుకుపోతుంది. దీంతో విదేశాల్లో టోర్నీ నిర్వహించడంపై చర్చ సాగుతోంది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు ప్రకటిస్తే.. ఐపీఎల్‌కు ప్రభుత్వం పూర్తి భద్రత కల్పించదు. ఇంతకుముందు 2009, 2014లో ఇలాంటి కారణాలతో ఐపీఎల్‌ను విదేశాలకు తరలించారు. ఇప్పుడు మళ్లీ విదేశాల్లో ఐపీఎల్ నిర్వహించాల్సిన అవసరం బీసీసీఐకి ఎదురైంది. 2009 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా దక్షిణాఫ్రికాలో ఐపీఎల్ నిర్వహించారు. అలాగే టోర్నీ ఎలాంటి అవాంతరాలు లేకుండా చాలా విజయవంతమైంది. 2014లో టోర్నీ ఫైనల్స్‌ను విదేశాల్లో నిర్వహించారు. ఆ రోజు ఐపీఎల్ ద్వితీయార్థంలో కొన్ని మ్యాచ్‌లకు యూఏఈ ఆతిథ్యం ఇచ్చింది.

ఆ తరువాత కోవిడ్ -19 భయం నేపథ్యంలో యూఏఈలో ఐపీఎల్ రెండుసార్లు నిర్వహించారు. అందువల్ల ఐపీఎల్‌ను విదేశాలకు తరలించాల్సిన అవసరం ఏర్పడితే యూఏఈ లేదా దక్షిణాఫ్రికాలో టోర్నీ నిర్వహించడం దాదాపు ఖాయమని తెలుస్తోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు