Wednesday, October 16, 2024
spot_img

ఈసారి ఫార్ములా-ఈ డౌటే..

తప్పక చదవండి

దేశంలోనే తొలిసారిగా ఫార్ములా-ఈ రేసుకు ఆతిథ్యమిచ్చిన హైదరాబాద్‌ పేరు ప్రఖ్యాతులు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ రేసు నిర్వహణను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పనిచేసింది. అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగాల్సిన రేసుపై నీలినీడలు కమ్ముకున్నాయి. హైదరాబాద్‌లో జరగాల్సిన ఆ రేసును క్యాలెండర్‌లో చేర్చకపోవడాన్ని చూస్తే ఇది నిజమేననిపిస్తోంది. ఫార్ములా-ఈ నిర్వాహకులకు హైదరాబాద్‌ రేసు ప్రమోటర్‌ గ్రీన్‌కో సంస్థకు మధ్య నగదు చెల్లింపులు, రేసు నిర్వహణలో ప్రణాళికా లోపం, ముందు రోజు వరకు ట్రాక్‌ పనులు పూర్తి కాకపోవడం, సర్క్యూట్‌ లోపల టీమ్‌లు, డ్రైవర్లకు టాయిలెట్లు… ఇతరత్రా ఏర్పాట్లు చేయకపోవడం పట్ల అల్బెర్టో లాంగో అసంతృప్తి వ్యక్తంచేశాడు. వచ్చే సీజన్‌లో రేసు జరగాలంటే వీటన్నింటినీ అధిగమించాల్సి వుందన్నాడు. అయితే రేసు నిర్వహణలో మంత్రి కేటీఆర్‌ కృషిని ఆయన అభినందించాడు. కాగా హైదరాబాద్‌లో ఈ ఏడాది నిర్వహించిన తొలి రేసుకు మీడియా, సోషల్‌ మీడియా పబ్లిసిటీలో విజయం సాధించారు కానీ, రేసు నిర్వహణ ప్రమాణాలను అందుకోవడం విఫలమయ్యారని పరోక్షంగా గ్రీన్‌కోపై విమర్శలు గుప్పించాడు. హైదరాబాద్‌లో రెండో రేసు నిర్వహించేదీ లేనిదీ ఇప్పుడే ప్రకటించలేమని లాంగో స్పష్టం చేశాడు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు