Friday, July 19, 2024

ఫోన్‌పేలో ‘యాప్‌ స్టోర్‌’..

తప్పక చదవండి
  • ఉచితంగా అప్‌లోడ్‌ చేసుకోవచ్చు..!

న్యూ ఢిల్లీ : దేశీయంగా డిజిటల్‌ పేమెంట్స్‌ సేవలందిస్తున్న ఫిన్‌టెక్‌ సంస్థ ఫోన్‌పే తన సేవలను విస్తరిస్తోంది. ఇండియన్స్‌కు యాప్‌ సేవల కోసం సొంతంగా యాప్‌ స్టోర్‌ తెస్తున్నది. ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ యాప్‌ స్టోర్‌ సిద్ధం చేసింది. త్వరలో ’ఇండస్‌ యాప్‌ స్టోర్‌’ అనే పేరుతో ఇండియన్‌ యాప్‌ డెవలపర్లకు అందుబాటులోకి తెస్తున్నది. ఇప్పటివరకు యాప్‌ స్టోర్స్‌ నిర్వహిస్తూ ఆధిపత్యం ప్రదర్శిస్తున్న గ్లోబల్‌ టెక్‌ దిగ్గజాలు గూగుల్‌, ఆపిల్‌ గట్టి సవాల్‌ విసిరింది. ఈ స్టోర్‌లో భారత్‌ యాప్‌ డెవలపర్లు తమ యాప్స్‌ను రిజిస్టర్‌ చేసుకుని అప్‌ లోడ్‌ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నది. భారతీయుల ప్రయో జనార్థం 13 భాషల్లో యాప్‌ స్టోర్‌ సేవలు అందుబాటులో ఉంటాయి. అమెరికా కేంద్రంగా పని చేస్తున్న ఈ-కామర్స్‌ సంస్థ ‘వాల్‌మార్ట్‌’ అనుబంధ సంస్థగా ఉన్న ఫోన్‌పే ఆధ్వర్యంలోని రూపుది ద్దుకున్న యాప్‌ స్టోర్‌ ‘ఇండస్‌ యాప్‌’ స్టోర్‌కు శాంసంగ్‌ వెంచర్‌ క్యాపిటల్‌ ఆర్మ్‌ మద్దతు అంది స్తోంది. భారతీయ యాప్‌ డెవలపర్లు ‘ఇండస్‌ యాప్‌’ స్టోర్‌లో రిజిస్టర్‌ చేసుకోవడంతోపాటు ఫ్రీగా అప్‌ లోడ్‌ చేసుకోవచ్చు. ఏడాది తర్వాత స్వల్ప ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. యాప్స్‌ డెవలపర్స్‌ నుంచి ప్లాట్‌ ఫామ్‌ ఫీజు లేదా చార్జీ వసూలు చేయబోవడం లేదని ఫోన్‌ పే తెలిపింది. యాప్‌ డెవలపర్లు తమకు నచ్చిన పేమెంట్‌ గేట్‌ వే ను ఫ్రీగా ఇంటిగ్రేట్‌ చేసుకోవచ్చు. 2015లో ఆకాశ్‌ డోంగ్రే, సుధీర్‌ బీ, రాకేశ్‌ దేశ్‌ముఖ్‌ అనే ఐఐటీయన్ల ఆలోచనలతో రూపుదిద్దుకున్నదే ఈ ‘ఇండస్‌ యాప్‌’ స్టోర్‌. భారతీయ స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లకు చేయూత ఇవ్వడానికి.. వారి చాయిస్‌కు అనుగు ణంగా కంటెంట్‌ అందించేందుకు ‘ఇండస్‌ ఓఎస్‌’ అనే యాప్‌ కంటెంట్‌ డిస్కవరీ ప్లాట్‌ఫామ్‌ ఏర్పా టు చేశారు. గూగుల్‌ ప్లే స్టోర్‌ గానీ, ఆపిల్‌ యాప్‌ స్టోర్‌ గానీ అన్ని యాప్‌లను అనుమతించడం లేదు. యాప్‌లు రూపొందించిన డెవలపర్ల నుంచి ప్రతియేటా 15-25 శాతం ఫీజు వసూలు చేస్తు న్నాయి. ‘వచ్చే మూడేండ్లలో భారత్‌లో వంద కోట్ల మందికిపైగా స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లు ఉంటారు. ఈ నేపథ్యంలో న్యూ జనరేషన్‌ అండ్‌ లోకలైజ్డ్‌ ఆండ్రాయిడ్‌ యాప్‌ స్టోర్‌ నిర్మాణానికి మంచి అవ కాశం ఉంది. భారీ కస్టమర్ల మార్కెట్‌, యాప్‌ డెవలపర్లు ఉన్నా.. వారు తయారు చేసే యాప్స్‌ పం పిణీ చేయాలంటే ఏకైక మార్గం ‘గూగుల్‌ ప్లే స్టోర్‌’పైనే ఆధార పడాల్సి వస్తున్నది. ఈ పరిస్థి తుల్లో భారతీయుల యాప్‌ డెవలపర్ల కోసం విశ్వసనీయమైన ఆల్టర్నేటివ్‌ ప్లాట్‌ఫామ్‌ అందించ గలమన్న ఆశాభావంతో ఉన్నాం అని ఇండస్‌ యాప్‌ స్టోర్‌ కో-ఫౌండర్‌, సీపీఓ ఆకాశ్‌ డోంగ్రే తెలిపారు.

లావా నుంచి బడ్జెట్‌ సెగ్మెంట్‌లో 5జీ ఫోన్‌..
ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ల తయారీ సంస్థ లావా తన లావా బ్లేజ్‌ ప్రో 5జీ ఫోన్‌ను ఈ నెల 26న భారత్‌ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఈ నెల 26 మధ్యాహ్నం 12 గం. యూ-ట్యూబ్‌ వీడియో ద్వారా భారత్‌ మార్కెట్లో ఆవిష్కరిస్తామని లావా ప్రకటించింది. ఈ ఫోన్‌ రెండు కలర్‌ ఆప్షన్లలో లభిస్తుంది. బ్లాక్‌, ఆఫ్‌-వైట్‌ షేడ్స్‌లో వస్తుంది. డ్యుయల్‌ రేర్‌ కెమెరాసెటప్‌, ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో రెండు సర్క్యులర్‌ కెమెరా మాడ్యూళ్లతో వస్తున్నది. 50-మెగాపిక్సెల్‌ ప్రైమరీ సెన్సర్‌ కెమెరాకలిగి ఉం టుంది. లావా బ్లేజ్‌ ప్రో 5జీ ఫోన్‌ 3.5 ఎంఎం ఆడియో జాక్‌, మైక్రోఫోన్‌, యూఎస్బీ టైప్‌-సీ పోర్ట్‌ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 6020 ఎస్వోసీ చిప్‌ సెట్‌ కలిగి ఉంటుందని తెలుస్తు న్నది. లావా బ్లేజ్‌ బ్రో 5జీ ఫోన్‌ ధర రూ.15 వేల లోపే ఉండొచ్చు. గతేడాది సెప్టెం బర్‌లో ఆవిష్క రించిన లావా బ్లేజ్‌ ప్రో 4జీ ఫోన్‌ 4జీబీ ర్యామ్‌ విత్‌ 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ వేరి యంట్‌ రూ.10,499లకే లభించింది. 6.5-అంగుళాల 2.5 డీ కర్వ్‌డ్‌ ఐపీఎస్‌ డిస్‌ ప్లే విత్‌ హెచ్డీం (720 ఐ1600పిక్సెల్స్‌) రిజొల్యూషన్‌, 90 హెర్ట్జ్‌ రీఫ్రెష్‌ రేట్‌కలిగిఉంది. 5000 ఎంఏహెచ్‌ కెపాసిటీ గల బ్యాటరీతోపాటు ఒక్టాకోర్‌ మీడియాటెక్‌ హెలియో జీ37 ఎస్వోసీ చిప్‌సెట్‌ కలిగి ఉంటుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు