Friday, May 17, 2024

యూ-ట్యూబ్‌ గుడ్‌ న్యూస్‌..

తప్పక చదవండి
  • సులువుగా వీడియోల సృష్టికి కొత్త యాప్‌..!

న్యూ ఢిల్లీ : వీడియో క్రియేటర్లకు ‘యూ-ట్యూబ్‌’ గుడ్‌ న్యూస్‌ తెలిపింది. తేలిగ్గా వీడియోలు తయారు చేసుకునేలా ‘యూ-ట్యూబ్‌క్రియేట్‌’అనే యాప్‌ తెస్తున్నట్లు వెల్లడిరచింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఆధా రంగా డిజైన్‌ చేసిన ‘డ్రీమ్‌సీన్‌’ ఫీచర్‌కూడా పరీక్షిస్తున్నట్లు తెలిపింది. దీంతో షార్ట్‌ వీడియోలకు ఏఐ ఆధారిత వీడియోలు, బ్యాక్‌గ్రౌండ్‌లో ఫొటోలు జోడిరచడానికి వీలవుతుంది. న్యూ జనరేటివ్‌ ఏఐ ఆధారిత యాప్‌లో ఎడిటింగ్‌ ట్రిమ్మింగ్‌, ఆటోమేటిక్‌ క్యాప్షనింగ్‌, వాయిస్‌ ఓవర్‌, ట్రాన్సిషన్స్‌ తదితర ఫీచర్లు ఉంటాయి. టిక్‌ టాక్‌ మాదిరే బీట్‌ మ్యాచింగ్‌ టెక్నాలజీ’తో వచ్చేరాయల్టీ ఫ్రీమ్యూజిక్‌’ను కస్టమర్లు వాడవచ్చు. సులువుగా వీడియోలు క్రియేట్‌ చేయడానికి, షేర్‌ చేయ డానికి ఈ యాప్‌ డెవలప్‌ చేశాం. షార్ట్‌, లాంగ్‌వీడియోల రూపకల్ప నకు దీన్నితీసుకొచ్చాం అనియూ-ట్యూబ్‌ కమ్యూనిటీ ప్రొడక్ట్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ టోనీ చెప్పారు. ఉచితంగా అందుబాటు లోకి ఉన్న ఈయాప్‌ ఇప్పటికైతే భారత్‌, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, ఇం డోనేషియా, దక్షిణ కొరియా, సింగపూర్‌ తదితర సెలెక్టె డ్‌ మార్కె ట్లలో ఆండ్రాయిడ్‌లో బీటాయూజర్లకు అందుబాటులో ఉంది. వచ్చే ఏడాది ఆపిల్‌ ఐ-ఫోన్‌ యూజర్లకుఅందుబాటులోఉంటుందీ యాప్‌.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు