Saturday, May 18, 2024

పెండింగ్ చలాన్లపై రాయితీ ప్రకటన

తప్పక చదవండి

హైదరాబాద్‌ : వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. పెండింగ్ చలాన్లపై రాయితీని ప్రకటించింది. టూవీలర్‌ పై 80 శాతం, ఫోర్‌ వీలర్స్‌, ఆటోలపై 60 శాతం, భారీ వాహనాలపై 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. అలాగే, ఆర్టీసీ బస్సులు, తోపుడు బళ్లపై 90 శాతం రాయితీ ఇచ్చింది. ఈ నెల 30 నుంచి రాయితీ పొందవచ్చు. రూ. 2 కోట్లకు పైగా పెండింగ్ చలాన్లు ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం రాయితీ కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో వాహన దారులు సంతోషం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లపై 90 శాతం రాయితీ, టూ వీలర్స్‌పై 80 శాతం, ఆటోలు, ఫోర్‌ వీలర్‌పై 60 శాతం రాయితీ, భారీ వాహనాలపై 50 శాతం రాయితీ కల్పించ నున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 26వ తేదీ నుంచి వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. 2022, ఫిబ్రవరి నెలలో పెండింగ్ చలాన్లపై నాటి ప్రభుత్వం రాయితీ కల్పించిన సంగతి తెలిసిందే. రెండు, మూడు చక్రాల వాహనాలకు 75 శాతం, ఆర్టీసీ బస్సులకు 70 శాతం, లైట్‌, హెవీ మోటారు వాహనాలకు 50 శాతం, తోపుడు బండ్లకు 75 శాతం రాయితీ ఇచ్చారు. నాడు రూ. 300 కోట్ల వరకు పెండింగ్ చలాన్లపై వసూళ్లు అయ్యాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు