- హామీలు నెరవేర్చడంలో జగన్ విఫలం
- తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
అమరావతి ; ఆంధ్రప్రదేశ్ ఉద్యమాంధ్రప్రదేశ్‌గా మారిందని ఇందుకు సమ్మెలే నిదర్శనమని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అంగన్‌వాడీలు, మున్సిపల్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో విఫలం అయ్యారని అన్నారు. పాదయాత్రలో నోటికొచ్చిన హామీలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ మోసం చేశారని లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ అంగన్‌వాడీలు, మున్సిపల్ కార్మికులు, ఆశా వర్కర్లు, త్వరలో వాలంటీర్లు.. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రోª`లడెక్కి నిరసన తెలపాల్సిన దుస్థితి ఏర్పడిరదన్నారు. ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మెకు కూడా టీడీపీ పూర్తి స్థాయి మద్దతు ఇస్తోందన్నారు. అంగన్‌వాడీల సమ్మెకు ఎలా అయితే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు మద్దతు తెలిపాయో.. అలానే సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న మున్సిపల్, ఆశా వర్కర్లకు కూడా మద్దతు తెలపాలని పిలుపు ఇస్తున్నామని నారా లోకేష్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలనకు ప్రజలు విసుగెత్తి ఉన్నారని , వైసీపీ ప్రజాప్రతినిధులపై తీవ్ర వ్యతిరేకత ఉందని, వైసీపీ నియంత పాలనకు ప్రజలే త్వరలో ఓట్ల రూపంలో బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. ప్రతిఒక్కరూ తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు.