Sunday, May 19, 2024

కురుమూర్తి జాతరలో మద్యం జోరు

తప్పక చదవండి
  • ఆందోళనలో భక్తులు..
  • పట్టించుకోని ఎక్సైజ్‌ అధికారులు..

దేవరకద్ర : మహబూబ్నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని పేదల తిరుపతి కురు మూర్తి జాతరలో అక్రమ మద్యం, డబ్బు ఏరులై పారుతుంది. అడ్డు అదుపు లేకుండా, రాత్రి, పగలు తేడా లేకుండా అక్రమ మద్యం అమ్మకాలు జరిపి అమాయక కురుమూర్తి స్వామి జాతర దర్శననికి వచ్చే భక్తులను పీడిస్తున్నారు. అక్రమ మద్యం అమ్మకాలు నియంత్రించే ఎక్సైజ్‌ అధికారులకు చేతులు తడపడంతో ఆ వైపు కన్నెత్తి చూడక పోవడాన్ని వివిధ గ్రామల ప్రజలు భక్తులు తప్పు పడుతున్నారు. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్‌ అధికారులు చోద్యం చేస్తుండడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇష్టానుసారంగా నిర్వహిస్తున్న యాజమాన్యం పై చర్యలు చేపట్టి మద్యం షాప్‌ను వెంటనే సీజ్‌ చేయాలి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎక్స్సైజ్‌ అధికారులపై జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. బేరం కుదిరితే పైసలు పుచ్చుకుంటున్నారని, బేరం కుదరకపోతేనే కేసుల వరకు వెళ్తున్నారని సమాచారం. ఇలా మద్యం విక్రయాలు ఇష్టారాజ్యంగా జరుగుతున్నా మద్యం కేసులు నమోదు కాకపోవడం వెనుక బేర సారాలే ప్రధాన కారణమనే ఆరోపణలు న్నాయి. మందు బాబులు మద్యాన్ని కొనుగోలు చేశాక ఎక్కడ పడితే అక్కడే తాగుతున్నారు.దీనికితోడు చికెన్‌ మటన్‌ కాల్చిన కూర షాపులలో సిట్టింగ్‌ పాయింట్లుగా మారాయి.

- Advertisement -

చికెన్‌ మటన్‌ షాప్‌ల వద్దనే మద్యం విక్రయదారులు ఏర్పాటు చేస్తున్నారు. మందు బాబుల ఆగడాల కారణంగా కురుమూర్తి జాతరకు వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారని చుట్టు పక్కల గ్రామస్థులు వాపోతు న్నారు. మద్యం నియంత్రణ పోయి మద్యం విక్రయాలు, తాగుబోతుల ఆగడాలు పెరిగాయ భక్తులు, ప్రజలు వాపోతు న్నారు. మద్యం మాఫియా చాప కింద నీరులా విస్తరిస్తోంది. యజమానులు చేతులు తడుపుతుం డటంతో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎస్‌ఈబీ) అధికారులు ఆ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి, దేవస్థానానికి అపవిత్రత వాతావరణ సూచించే వారిని ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని సిపిఎం కమ్యూనిస్టు నాయకులు అర్జున్‌ కుమార్‌ చింతకుంట మధుబాబు జిల్లా నాయకులు ఎస్‌ గోపి టిఆర్‌ఎస్‌ నాయకులు గుండ్లకుంట లక్ష్మణ్‌ వెంకటేష్‌ తదితరులు హెచ్చరిస్తున్నారు నివారించకపోతే ఆందోళన కార్యక్రమం ధర్నా రాస్తారోకో చేస్తామని డిమాండ్‌ చేస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు