Saturday, May 18, 2024

నేతల ఒత్తిడికి తలొగ్గిన మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలి..

తప్పక చదవండి
  • కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్న మున్సిపల్ కమిషనర్, టీపీఎఫ్
    నిర్మాణ పనులకు వక్ఫ్ బోర్డు అనుమతి ఉన్నా పట్టించుకోని అధికారులు
  • అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి…
  • దర్గా నిర్వాహకుల వంశస్థులు సయ్యద్ యాకూబ్ మొహీనుద్దీన్ ఖాద్రి

గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లా మున్సిపల్ అధికారులు స్థానిక నేతల ఒత్తిడికి, ప్రలోభాలకు తలొగ్గి కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి విధంగా విధులు నిర్వహిస్తున్నారని, దీనిపై జిల్లా ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని హాజరత్ సయ్యద్ షా మారూఫ్ పీర్ ఖాద్రి రహమతుల్లా దర్గా నిర్వాహకుల వంశస్థులు సయ్యద్ యాకూబ్ మొహీనుద్దీన్ ఖాద్రి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ గద్వాల మున్సిపాలిటిలోని రాఘవేంద్ర కాలనీ రాయచూరు రోడ్డు పక్కన ఉన్న హాజరత్ సయ్యద్ షా మారూఫ్ పీర్ ఖాద్రి దర్గాకు సంబంధించి సర్వే నంబర్లు 1011, 1012, 1038, 1039, 1095, 96, 97, 98లలో మొత్తం 39ఎకరాల 10గుంటల భూమి కలదు. ఇందులో 1012 సర్వే నంబర్ లోని 20గుంటల దర్గా ముందున్న స్థలంలో దర్గా అభివృద్ధి కోసం చేపడుతున్న షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను చేపడుతున్న క్రమంలో స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకు మున్సిపల్ కమీషనర్ తమ సిబ్బంది టీపీఓ ద్వారా పనులను అడ్డుకుంటున్నారని తెలిపారు. పనులకు సంబంధించి వక్ఫ్ బోర్డు నుంచి అనుమతులు ఉన్నప్పటికీ మున్సిపల్ అధికారులు అడ్డు చెప్తుండడంతో జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ లకు సైతం సమస్యను విన్నవించి పనులు చేపట్టేందుకు అనుమతులు తీదుకున్నప్పటికీ ఈ అధికారులు వాటిని సైతం లెక్కచేయకుండా దర్గా వాచ్ మెన్, పనులు చేసే కార్మికులను భయబ్రాంతులకు గురి చేస్తూ ఇబ్బందులు కలిగిస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై మున్సిపల్ పాలకులు జిల్లా అధికారులు స్పందించి మున్సిపల్ కమిషనర్, టీపీఎఫ్ లపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు సైతం దృష్టి సారించి ఇలాంటి అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకొని తగు న్యాయం చేయాలని కోరారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు