నిన్నటి ఎన్నికల్లో
హస్తం హావనే కొనసాగిందండీ..
కాంగ్రెస్ సునామిలో
కారు కొట్టుకపోవడం గ్యారంటండీ!
ఈసారి ప్రజలు కసితో ఓటేసారండీ..
పేరు మార్చిన ఉద్యమా పార్టీకి,
నూకలు చెల్లిపోయాయని మేము మొర్రో
ఆని మొత్తుకున్నా మీరు వినలేదండి..
ఎండిపోయిన గులాబీ చెట్టుకు,
మొగ్గలు రాలిపోవడం
సర్వసధారణమే కదండీ..
పదేండ్ల మీ పరిపాలనకు నిదర్శనంగా
మీరు కట్టిన వైకుంఠ దామాలకు
మీపేరే పెట్టుకుంటాం, బాధపడకండి..
ఆఖరికి ప్రతి పక్షంలో కూర్చుండే అవకాశం
దొరికిన సంతోషించండి..
అభివృద్ధి పేరుతో మీరు కాంగ్రెస్ లో చేరితే
మేము సహించలేమండి..
చిన్నదోర ఆశల మీద
మీరే నీళ్లు చల్లారు కదండీ!
రేపటి మీ రాజకీయ భవిష్యత్తును
ఊహించుకుంటే జాలేస్తుందండి..
పెద్దపల్లి రాజన్న