Saturday, May 18, 2024

మెదక్ లో రోడ్డు ప్ర‌మాదంతో ఓ మ‌హిళ, ఇద్ద‌రు పిల్ల‌లు మృతి..

తప్పక చదవండి

మెద‌క్ : మెద‌క్ జిల్లా మ‌నోహ‌రాబాద్ మండ‌లం క‌ల్ల‌క‌ల్ వ‌ద్ద గురువారం ఉద‌యం ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. ఓ మ‌హిళ త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి స్కూటీపై వెళ్తుండ‌గా, గుర్తు తెలియ‌ని వాహ‌నం ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో త‌ల్లి, ఇద్ద‌రు పిల్ల‌లు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మేడ్చ‌ల్ నుంచి తూప్రాన్ వైపు వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని, మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృతుల వివ‌రాలు తెలియాల్సి ఉంద‌ని పోలీసులు తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు