Wednesday, May 8, 2024

కన్నీటి వరద

తప్పక చదవండి
  • హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వానలు
  • మరో రెండ్రోజులు ఉంటాయని హెచ్చరిక
  • నీటమునిగిన మేడ్చల్‌ జిల్లా మైసమ్మ గూడ ప్రాంతం
  • ట్రాక్టర్లలో హాస్టల్‌ విద్యార్థినుల తరలించిన పోలీసులు
  • కబ్జాకు గురవుతున్న చెరువులు, నాలాలు
  • పట్టించుకోని అధికారులు, పాలక ప్రభుత్వం
    ఒక్కసారి భారీ వర్షం కురిస్తే చాలు మహానగరం ఆగమాగమైపోతోంది.. జనజీవనం అతలాకుతలమై పోతోంది.. అమాయకుల ప్రాణాలు నీటిలో కలిసిపోతున్నాయి.. ఈ పాపం ఎవరిది..? పాలించే పాలకులదా..? సిగ్గు ఎగ్గూ విడిచిపెట్టి పేట్రేగిపోతున్న కబ్జాకోరులదా..? నాలాలను సైతం వదలకుండా కబ్జాలు చేస్తున్నందునే.. వర్షపునీరు ఎటూ పోలేక ఇండ్లలోకి చేరుతోంది.. మారణహోమం సృష్టిస్తోంది.. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏమి లాభం.. దురాక్రమణలను ఆదిలోనే అరికట్టగలిగితే ఇంతటి దౌర్భాగ్య పరిస్థితులు వచ్చేవి కాదు కదా..? ముందు చూస్తూ ఊరుకోవడం.. అనర్ధం జరిగినాక ఆర్భాటాలు చేయడం.. ఇది క్షంతవ్యం కాదు.. ఇప్పటికైనా ప్రభుత్వాలు, అధికారులు కళ్ళు తెరిస్తే తప్ప పరిస్థితుల్లో మార్పు రాదు.. కబ్జాలపై, దురాక్రమణలపై ఆదాబ్‌ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంది.. ఆ హెచ్చరికలను పెడచెవిన పెట్టబట్టే ఈ దుస్థితి నెలకొంది.. పాలకులారా మొద్దునిద్ర వీడి మేల్కోండి.. చెరువులు, ఎఫ్‌.టి.ఎల్‌. బఫర్‌ జోన్లు, నాలాలు అడ్డగోలుగా కబ్జాలకు గురి అవుతున్నా అధికార ప్రభుత్వం గానీ, సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్‌, నీటిపారుదల శాఖ, జీ.హెచ్‌.ఎం.సి. శాఖల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోతున్నారు.. ప్రతి చెరువుకు ఒక నెంబర్‌ ఉంటుంది.. మరి వాటిని కాపాడాల్సిన అధికారులు సైతం కబ్జాకోరులకు తమ వంతు సహకారం అందిస్తున్నారు.. ప్రభుత్వానికి తెలిసే ఇదంతా జరుగుతోందని విమర్శకులు అంటున్నారు.. విశ్వనగరంగా పేరుగాంచిన హైదరాబాద్‌ లోనే ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదురవుతుంటే.. ఇక జిల్లాల, గ్రామాల పరిస్థితి ఏమిటి..? ఎవరో చేసిన పాపాలకు అమాయకులు బలికావాల్సిందేనా..?
    హైదరాబాద్‌ : హైదరాబాద్‌ సహా తెలంగాణలో పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తున్నది. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరపి లేకుండా వాన పడుతూనే ఉంది. ఖైరతాబాద్‌, అమీర్‌పేట, సోమాజీగూడ, నాంపల్లి, మలక్‌పేట, సైదాబాద్‌, పాతబస్తీ, ఎల్బీనగర్‌, సాగర్‌రింగ్‌రోడ్‌, హస్తినాపురం, బీఎన్‌రెడ్డి, నాగోల్‌, ఉప్పల్‌, హబ్సిగూడ, తార్నాక, ఈసీఐఎల్‌, సికింద్రాబాద్‌, బేగంపేట, అడ్డగుట్ట, మారేడుపల్లి, ప్యాట్నీ, ప్యారడైస్‌, బోయిన్‌పల్లి, సుచిత్ర, కొంపల్లి, తిరుమలగిరి, అల్వాల్‌, బొల్లారం, చిలకలగూడ, కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, నిజాంపేట్‌, ప్రగతినగర్‌, కేపీహెబీ కాలనీ, ఆల్విన్‌ కాలనీ, మియాపూర్‌, కుత్భుల్లాపూర్‌, బీహెచ్‌ఈఎల్‌, కొండాపూర్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, మెహదీపట్నంలో వాన దంచికొట్టింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. రోడ్లపై నీరు నిలువకుండా చర్యలు తీసుకున్నారు. వచ్చిన నీరు వచ్చినట్లే వెళ్లేలా చూస్తున్నారు. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతారణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. 11 జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికలు, 18 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీచేసింది. జగిత్యాల, కరీంనగర్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడతాయని, ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. ఎల్లో అలర్ట్‌ జారీచేసిన జిల్లాల్లో ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, హన్మకొండ, సిద్దిపేట, కామారెడ్డి, వనపర్తి, జోగులాంబ గద్వాల, హైదరాబాద్‌, మేడ్చల్‌, మల్కాజిగిరి, రంగా రెడ్డి, యాదాద్రి, సంగారెడ్డి, వికారబాద్‌ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీచేసింది. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని చెప్పింది. మంగళవారం నుంచి బుధవారం వరకు మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ములు గు, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ జిల్లాల్లో అక్కడక్క అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేయగా, ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, రంగారెడ్డి జిల్లాలతో పాటు ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వివరించింది.
    నీట మునిగిన మేడ్చల్‌ జిల్లా మైసమ్మ గూడ ప్రాంతం
    మేడ్చల్‌ జిల్లా మైసమ్మ గూడ ప్రాంతం పూర్తిగా నీట మునిగిపోయింది. అక్కడున్న భవనాల్లో మొదటి అంతస్తు వరకు నీళ్లు రావటంతో.. స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. అయితే.. ఆ భవనాల్లో సుమారు 15 హాస్టల్‌లు ఉండగా… విద్యార్థులు బయటకు వచ్చేందుకు కూడా వీలులేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడే 30 అపార్ట్‌మెంట్లు ఉండగా.. ఇంజినీరింగ్‌ చదివే విద్యార్థినులు ఆ అపార్ట్‌మెంట్లలోనే ఉంటున్నారు. అయితే.. మొదటి అంతస్తు వరకు వరద నీరు చేరడంతో విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు.. ఘటనా స్థలానికి ట్రాక్టర్లు, జేసీబీలను పంపించి విద్యార్థులను ముంపు ప్రాంతం నుంచి బయటకు తీసుకొచ్చారు. ఉదయం నుంచి భయంతో గజగజా వణికిపోయిన విద్యార్థినులు.. తమ లాగేజీలతో ట్రాక్టర్లలో స్వగ్రామాలను బయలుదేరి వెళ్లిపోయారు. ఇక్కడే కాకుండా.. మైసమ్మగూడలోని పలు కాలనీల్లోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి.
    నిండుకుండలా శ్రీరాం సాగర్‌ ప్రాజెక్ట్‌
    ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రస్తుతం జలాశయంలోకి 75,100 క్యూసెక్కుల వరద వస్తుందని. దీంతో అధికారులు 16 గేట్లు ఎత్తి 64,038 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో మొత్తం 90 టీఎంసీల నీటిని నిల్వ ఉంచవచ్చు. అయితే పెద్దఎత్తున వరద వస్తుండటంతో ప్రాజెక్టు ఇప్పటికే నిండుకుండలా మారింది. జిల్లాలో ఉన్న మరో జలాశయమైన రామడుగు ప్రాజెక్టులోకి 12,285 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండటంతో 1278.3 అడుగులకు నీటిమట్టం చేరింది. ఇక కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి 29,800 క్యూసెక్కుల వరత వస్తున్నది. దీంతో అధికారులు నాలుగు గేట్లు ఎత్తి నిటిని విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 17 టీఎంసీల నీరు ఉన్నది. కామారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షపాతం నమోదయింది. గాంధారిలో 14.4 సెంటీమీటర్లు, కామారెడ్డిలో 9.9, నాగిరెడ్డిపల్లిలో 9.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో జుక్కల్‌`బస్వాపూర్‌ మధ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో రోడ్డు కొట్టుకుపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
    ఒక్కసారి భారీ వర్షం కురిస్తే చాలు మహానగరం ఆగమాగమైపోతోంది.. జనజీవనం అతలాకుతలమై పోతోంది.. అమాయకుల ప్రాణాలు నీటిలో కలిసిపోతున్నాయి.. ఈ పాపం ఎవరిది..? పాలించే పాలకులదా..? సిగ్గు ఎగ్గూ విడిచిపెట్టి పేట్రేగిపోతున్న కబ్జాకోరులదా..? నాలాలను సైతం వదలకుండా కబ్జాలు చేస్తున్నందునే.. వర్షపునీరు ఎటూ పోలేక ఇండ్లలోకి చేరుతోంది.. మారణహోమం సృష్టిస్తోంది.. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏమి లాభం.. దురాక్రమణలను ఆదిలోనే అరికట్టగలిగితే ఇంతటి దౌర్భాగ్య పరిస్థితులు వచ్చేవి కాదు కదా..? ముందు చూస్తూ ఊరుకోవడం.. అనర్ధం జరిగినాక ఆర్భాటాలు చేయడం.. ఇది క్షంతవ్యం కాదు.. ఇప్పటికైనా ప్రభుత్వాలు, అధికారులు కళ్ళు తెరిస్తే తప్ప పరిస్థితుల్లో మార్పు రాదు.. కబ్జాలపై, దురాక్రమణలపై ఆదాబ్‌ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంది.. ఆ హెచ్చరికలను పెడచెవిన పెట్టబట్టే ఈ దుస్థితి నెలకొంది.. పాలకులారా మొద్దునిద్ర వీడి మేల్కోండి.. చెరువులు, ఎఫ్‌.టి.ఎల్‌. బఫర్‌ జోన్లు, నాలాలు అడ్డగోలుగా కబ్జాలకు గురి అవుతున్నా అధికార ప్రభుత్వం గానీ, సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్‌, నీటిపారుదల శాఖ, జీ.హెచ్‌.ఎం.సి. శాఖల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోతున్నారు.. ప్రతి చెరువుకు ఒక నెంబర్‌ ఉంటుంది.. మరి వాటిని కాపాడాల్సిన అధికారులు సైతం కబ్జాకోరులకు తమ వంతు సహకారం అందిస్తున్నారు.. ప్రభుత్వానికి తెలిసే ఇదంతా జరుగుతోందని విమర్శకులు అంటున్నారు.. విశ్వనగరంగా పేరుగాంచిన హైదరాబాద్‌ లోనే ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదురవుతుంటే.. ఇక జిల్లాల, గ్రామాల పరిస్థితి ఏమిటి..? ఎవరో చేసిన పాపాలకు అమాయకులు బలికావాల్సిందేనా..?
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు