Thursday, May 16, 2024

71 లక్షల వాట్సాప్‌ అకౌంట్లపై వేటు

తప్పక చదవండి

న్యూఢిల్లీ : మెటా సంస్థకు చెందిన ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ గతేడాది నవంబర్‌ నెలలో 71 లక్షలకు పైగా అకౌంట్స్‌ని బ్యాన్‌ చేసినట్లుగా తెలిపింది. 2023 నవంబర్‌ 1 నుంచి 30 మధ్య 71,96,000 ఖాతాలను బ్యాన్‌ చేసినట్లుగా వెల్లడించింది. ఇందులో దాదాపు 19,54,000 ఖాతాలపై ముందుగానే ఫిర్యాదులు వచ్చినట్లుగా తెలిపింది. భారత ఐటీ నిబంధనలను అనుసరించి ఈ చర్యలు తీసుకున్నట్లుగా వాట్సాప్‌ వెల్లడిరచింది. భారతీయ ఖాతాలుగా చెలామణీ అవుతూ.. ?91 కోడ్‌లేని ఖాతాలపై కూడా నిషేధం విధించినట్లు తెలిపింది. భారత్‌ లో 500 మిలియన్లకు పైగా యూజర్స్‌ ను కలిగి ఉన్న వాట్సాప్‌.. యూజర్లకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా వారి వ్యక్తిగత డేటాకు ఎలాంటి భంగం వాటిల్లకుండా ఎండ్‌టు`ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌తో భద్రత కల్పిస్తుంది. ఐటీ నిబంధనల ప్రకారం 50 లక్షల యూజర్లు ఉన్న ప్రతి సోషల్‌ మీడియా సంస్థ నెలవారీ రిపోర్ట్‌ను పబ్లిష్‌ చేయాల్సి ఉంటుంది. యూజర్స్‌ నుంచి వచ్చే ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే వివరాలను పొందుపరాచాల్సి ఉంటుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు