Tuesday, April 30, 2024

‘కుత్బుల్లాపూర్ గోస – శ్రీశైలం అన్న భరోసా’

తప్పక చదవండి

హైదరాబాద్ : ‘కుత్బుల్లాపూర్ గోస – శ్రీశైలం అన్న భరోసా’ కార్యక్రమంలో భాగంగా సోమవారం సుభాష్ నగర్ 130 డివిజన్ లోని రాజీవ్ గృహ కల్ప, 60 యార్డ్స్, మైత్రి నగర్, తెలుగుతల్లి నగర్ లలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పర్యటించారు. బస్తీలలో స్థానికులతో కలిసి పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. రాజీవ్ గృహకల్పలో గతంలో నాణ్యత లేని డ్రైనేజ్ పైప్ లైన్ వేసి, సిసి రోడ్డు వేయకపోవడంతోనే పైప్ లైన్ ధ్వంసం అయిందని, రోడ్డు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆయన దృష్టికి తీసుకురాగా, సమస్య పరిష్కారానికి ఆయన హామీ ఇచ్చారు. రాజీవ్ గృహ కల్ప ఆటో స్టాండ్ వద్ద బీజేపీ జెండాను మాజీ ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అంతకు ముందు అర్జీకే ఆటోస్టాండ్ వద్ద గల అంబెడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సమస్యల వలయంగా తయారయిందని అన్నారు. యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకుండా, జాబ్ మేళాల పేరిట మళ్ళీ యువతను మోసం చేయడానికి ఎమ్మెల్యే వివేకానంద సన్నద్ధం అయ్యాడని అన్నారు. ముచ్చటగా మూడో సారి ప్రజలను వంచించడానికి సిద్దమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కు ప్రజలే ఈసారి బుద్ది చెప్తారన్నారు. కుత్బుల్లాపూర్ లో బీఆర్ఎస్ పార్టీ పని ఖతమైందని, కమలం వికసిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సుభాష్ నగర్ డివిజన్ అధ్యక్షులు కంది శ్రీరాములు, సీనియర్ నాయకులు ఎం.ఎస్ వాసు, బావిగడ్డ రవి, బస్తీ నాయకులు చక్రి, నాగేశ్వర్, డాన్సర్ శ్రీను, శ్రీనివాస్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, ఉష, డివిజన్ సీనియర్ నాయకులు దారం సాయి కుమార్, హనుమాన్ కచవా, అంగడి మల్లేష్, గుబ్బల లక్ష్మీనారాయణ, దేవర రమేష్, విజేందర్ రెడ్డి, కుమ్మరి శంకర్, మల్లేష్ గౌడ్, క్రాంతి యాదవ్, లోచారo రమణ, సంతోష్, బీజేవైఎం నాయకులు సాయిరాం రెడ్డి, జూల సందీప్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు