- పార్కింగ్ వసూలు చేస్తే కఠిన చర్యలు..
- హెచ్చరించిన డిప్యూటీ కమిషనర్ నరసింహ..
హైదరాబాద్ : కుర్మగూడ డివిజన్, మాదన్నపేట కూరగాయల మార్కెట్ పార్కింగ్ వసూళ్లకు అనుమతులు లేవని జీ.హెచ్.ఎం.సి. సర్కిల్ – 7 డిప్యూటీ కమిషనర్ నరసింహ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అక్రమ పార్కింగ్ పై వచ్చిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ తరువాత.. అక్రమంగా సరైన పాత్రలు లేకుండా పొందిన లైసెన్స్ రద్దు చేసినట్లు తెలిపారు. ఇక పై మార్కెట్ లో అక్రమ పార్కింగ్ కు వసూళ్లకు పాల్పడితే జీహెచ్ఎంసి, పోలీసు శాఖ లకు ఫిర్యాదు చేయాలని సూచించారు. శ్రీ వెంకటేశ్వర పార్కింగ్ పేరుతో పొందిన ట్రేడ్ లైసెన్స్ నెంబర్ కూడా రద్దు చేసినట్లు తెలిపారు. అక్రమ పార్కింగ్ వసూళ్ల పై మాదన్నపేట పోలీసులకు సమాచారమిస్తామన్నారు.