- నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు
కేపీ విసదాల్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం.. - అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందించడంలో
బీ.ఆర్.ఎస్. ప్రభుత్వం విఫలం అవడంతో ఈ నిర్ణయం..
హైదరాబాద్ : బీ.ఆర్.ఎస్. ప్రభుత్వ వైఫల్యాలపై విసిగి వేసారిపోయిన ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో ఆ పార్టీలో చేరుతున్నారు.. ఈ చేరికలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి..
జీడిమెట్ల డివిజన్ 132 పరిధిలోని, కుత్బుల్లాపూర్ గ్రామం, అయోధ్య నగర్, జయరాంనగర్ లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ సమావేశాలలో భాగంగా.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళిత బంధు, బీసీ బందు, మైనార్టీ బందు అరుహులైన వారికి అందించడంలో వైఫల్యం చెందినందుకు అధికార పార్టీ అయిన బిఆర్ఎస్ పార్టీని వదిలి సుమారు 400 మంది నాయకులు, కార్యకర్తలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కె.పి.విశాల్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి పథకాలను వివరించాలన్నారు.
చేతి గుర్తుకు ఓటు వేసి, మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొలను హనుమంత్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…
కోలన్ హనుమంత్ రెడ్డి సమక్షంలో భారీ చేరికలు :
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జాంగిర్ భాయ్ కూతురు ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ చేరికల కార్యక్రమంలో.. కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీఎమ్మెల్యే అభ్యర్థి కోలన్ హనుమంత్ రెడ్డితో పాటు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి.. ఈ కార్యక్రమంలో సొంటిరెడ్డి పున్నారెడ్డి సభాముఖంగా మాట్లాడుతూ.. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టబోతున్నటువంటి ఆరు గ్యారెంటీల గురించి వివరిస్తూ కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలన్ హనుమంత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగినది.
కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న దూలపల్లి వాసులు :
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ దూలపల్లి వాసులు 100 మంది బిజెపి మైనార్టీ ప్రెసిడెంట్ షేక్ జహంగీర్, బీ.ఆర్.ఎస్. నాయకులు కె. భిక్షపతి, వారి మిత్ర బృందం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలన్ హన్మంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు..