Thursday, April 25, 2024

ప్రజాపోరు యాత్ర స్పూర్తితో బహిరంగసభను జయప్రదం చేద్దాం..

తప్పక చదవండి
  • జూన్‌ 4న కొత్తగూడెంలో ప్రజా గర్జన సభకు వేలాదిగా తరలిరండి…
  • ఉమ్మడి జిల్లాల్లో ఎవరు గెలవాలన్నా , ఓడాలన్నాఆ అస్త్రం సీపీిఐ చేతిలోనే ఉంది : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని

భద్రాచలం 16 మే (ఆదాబ్‌ హైదరాబాద్‌): రాష్ట్ర వ్యాపితంగా జరిగిన ప్రజాపోరు యాత్ర స్పూర్తితో కొత్తగూడెంలో జూన్‌ 4న జరిగే ప్రజాగర్జన బహిరంగ సభను జయప్రదం చేయాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. మంగళవారం భద్రాచలంలో జరిగిన నియోజకవర్గ స్థాయి శాఖ కార్యదర్శి లు.మండలాల కార్యవర్గ సభ్యులు.ప్రజా సంఘాల భాద్యుల సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ప్రజాసమస్యల పరిస్కారం, పాలకుల ఎన్నికల హామీల అమలు, దేశ సమగ్రత, సమైక్యతకు రాష్ట్ర వ్యాపితంగా రెండు నెలలపాటు ప్రజాపోరు యాత్ర విజయవంతంగా కొనసాగిందని, ప్రజల నుంచి అనూహ్యస్పందన లభించిందని తెలిపారు. భద్రాద్రి జిల్లాలో 36 బహిరంగ సభలు నిర్వహించి 1.70లక్షల మందికి పొరుయాత్ర లక్ష్యాన్ని చెరవేసి పాలకుల వైఫల్యాన్ని ఎండగట్టగలిగిన జిల్లా పార్టీ నాయకత్వంకి శుభాకాంక్షలు తెలిపారు.. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు మాట్లాడుతూ.. యాత్రల ముగింపుగా లక్ష మందితో కొత్తగూడెం వేదికగా ప్రజాగర్జన సభ నిర్వహించే లక్ష్యంతో పార్టీ శ్రేణులు విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు.కొత్తగూడెం కేంద్రంగా జరిగే బహిరంగ సభలో ఉమ్మడి జిల్లాలో సిపిఐ బలాన్ని పాలకులకు చాటి చెప్పాలని ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో ఎండ కట్టడానికి సిపిఐ సిద్ధంగా ఉందని ఉన్నారు.ఎన్నికల క్షేత్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎవరు గెలవాలన్నా ఎవరు ఓడాలన్నా ఆ అస్త్రం సిపిఐ చేతిలోనే ఉందని అన్నారు.కేంద్రంలోని మతతత్వ బిజెపికి కర్ణాటక ఎన్నికల ఫలితాలతో పతనం ప్రారంభమైందని, ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్య దర్శి ఎస్‌ కే సాబీర్‌ పాషా. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావులపల్లి రాంప్రసాద్‌. కల్లూరి వెంకటేశ్వరరావు. ఆకోజు సునిల్‌ కుమార్‌.తాతజి. పోతయ్య. రామిరెడ్డి. బల్లా సాయి కుమార్‌. పర్షిక బాలకృష్ణ. కోడె రమేష్‌.నల్లబోయిన రవీందర్‌. మువ్వా రామలక్ష్మి. అమ్మాజీ.చిట్టెమ్మా.వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు