Thursday, April 25, 2024

డివైఎఫ్ఐ కేంద్ర కమిటి సమావేశాలను జయప్రదం చేయండి..

తప్పక చదవండి

హైదరాబాద్, 23 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :
మే 26, 27, 28 తేదిల్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో హైద్రాబాద్ లో జరిగే డివైఎఫ్ఐ అలిండియా కమిటి సమావేశాలను జయప్రదం చేయాలని డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, ఆనగంటి వెంకటేష్ లు పిలుపునిచ్చారు. మంగళవారం రోజున డివైఎఫ్ఐ అలిండియా కమిటి సమావేశాల వాల్ పోస్టర్ ని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మే 26 వ తేదిన విద్య, ఉపాధి, పర్యావరణం అంశాలపై సెమినార్ నిర్వహిస్తున్నామని ఈ సెమినార్ కి డివైఎఫ్ఐ అలిండియా కార్యదర్శి హిమాగ్నరాజ్ భట్టాచార్య, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి లు హజరవుతున్నారని.. అదే విధంగా మే 27, 28 తేదీల్లో హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అలిండియా ‌కమిటి సమావేశాలు నిర్వహించటం జరుగుతుందని.. ఈ సమావేశాలను జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి యువజన సంఘం నాయకులు హాజరవుతారని, ఈసమావేశంలో దేశంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి, భవిష్యత్ పోరాట కార్యాచరణ రూపొందించడం జరుగుతుందన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది.. కానీ నేడు ఉన్న ఉద్యోగాలనే తొలగిస్తూ నిరుద్యోగాన్ని పెంచిపోషిస్తుందన్నారు.. ప్రభుత్వ సంస్థలను పూర్తిగా ప్రయివేటు వ్యక్తులకు కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలు యువతను నిర్వీర్యం చేసే విధంగా ఉన్నాయని అన్నారు. బిజెపి ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించకుండా యువతలో మతోన్మాద విషబీజాలు నాటుతూ.. విద్వేషాలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుతుందన్నారు. అందరికీ విద్య, ఉపాధి కల్పించాలని, దేశంలో, రాష్ట్రంలో వివిధశాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటిని‌ భర్తీ చేయాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర సహయ కార్యదర్శి ఎం.డి.జావెద్, నాయకులు శివ, రఘు, శ్రీమాన్, రాజు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు