Tuesday, April 23, 2024

ఆర్టీసీ సమ్మె కాలంలో పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి..

తప్పక చదవండి
  • తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు..
  • కోర్టుకు హజరైన ప్రజా సంఘాల నేతలు, ఆర్టీసీ కార్మికులు..

హైదరాబాద్, 23 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :
2019 అక్టోబర్ లో తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని సుమారు 50 వేయిల మంది ఆర్టీసీ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగిన క్రమంలో వారికి అండగా నిలబడిన అనేకమంది ప్రజాసంఘాల నాయకులపై ప్రతిపక్ష పార్టీల నాయకులపై విద్యార్థి యువజన సంఘాల నేతలపై అక్రమ కేసులు బనయించారన్నారు. తక్షణమే ఆ కేసులను బేషరతుగా ఎత్తివేయాలని తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్టీసీ సమ్మె కాలం నాటి కేసుకు సంబంధించి మంగళవారం కోర్టుకు హాజరైన అనంతరం పందుల సైదులు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం అనేక అక్రమ కేసులు బనయించబడ్డాయన్నారు. ఆనాడు గర్వంగా భావించామన్నారు. వచ్చిన రాష్ట్రంలో కూడా అక్రమ కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని ఈ తెలంగాణ ప్రభుత్వానికి సిగ్గు చేటైన విషయం అన్నారు. అనాడు ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపకుండా వారి న్యాయబద్ధమైన డిమాండ్లు నెరవేర్చకుండా ప్రభుత్వమే పంతానికి పోయి అనేకమంది ఆర్టీసీ కార్మికుల సావులకు కారణమైందన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతోనే 52 రోజులపాటు సమ్మె కొనసాగిందన్నారు. అలా ఆనాడు ఆర్టీసీ కార్మికులను భయభ్రాంతులకు గురి చేస్తున్న సందర్భంలో సమ్మెను విచ్చిన్నం చేయడానికి అనేక కుట్రలకు తెరలేపిన సమయంలో ప్రజాసంఘాల నేతలుగా వారికి అండగా నిలబడ్డామన్నారు. ఆర్టీసీ కార్మికులకు పూట గడువని సందర్భంలో జోల పట్టుకొని రూపాయ రూపాయ పోగుచేసి 1,30,000 రూపాయలతో సుమారు 68 మంది నిరుపేద ఆర్టీసీ కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి వారి కుటుంబాలను ఆదుకున్నామని గుర్తు చేశారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల పొట్టగొడితే మేము వారికి అండగా నిలబడ్డామన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రం లో సుమారు 70 మంది ప్రజాసంఘాల,ప్రతిపక్ష పార్టీల, ఆర్టీసీ కార్మిక నేతలపై 5 కేసులు పెట్టారని వీటితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె కాలంలో పెట్టిన అక్రమ కేసులన్నింటిని బేషరతుగా వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

ఈ కేసుకు సంబంధించి కోర్ట్ కు హజరై న వారిలో ప్రజా సంఘాల నేతలు దండంపల్లి సత్తయ్య, పలస యాదగిరి, తెలంగాణ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కొండేటి మురళి సామాజిక కార్యకర్త బొంతు రమేష్ యూసుబు తదితరులు ఉన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు