Wednesday, May 8, 2024

ఫిబ్రవరి 23 నుంచి మహిళల క్రికెట్‌ టోర్నీ ప్రారంభం

తప్పక చదవండి

ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ సీజన్‌-2 షెడ్యూల్‌ వచ్చేసింది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహిళల క్రికెట్‌ టోర్నీ ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానుండగా, మార్చి 17న ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈసారి రెండు నగరాల్లో టోర్నీ జరగబోతోంది. దీని ప్రకారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం తొలి దశ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. అలాగే ఫైనల్‌తో సహా రెండో దశ మ్యాచ్‌లు ఢిల్లీ లోని అరుణ్‌ జైట్లీ గ్రౌండ్‌లో జరగనున్నాయి. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ సీజన్‌-2 తొలి మ్యాచ్‌లో డిఫెండిరగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. అలాగే, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఫిబ్రవరి 24 నుండి తమ ఔూూ సమరాన్ని ప్రారంభించనుంది. వారి మొదటి మ్యాచ్‌లో ఖూ వారియర్స్‌తో తలపడుతుంది. 2023లో జరిగిన ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ ప్రారంభ ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్‌ టైటిల్‌ గెలుచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 7 వికెట్ల తేడాతో గెలిచి తొలి మహిళల ప్రీమియర్‌ లీగ్‌ ట్రోఫీని గెలుచుకుంది.

2024 పూర్తి షెడ్యూల్‌:

- Advertisement -

ఫిబ్రవరి 23- ముంబై ఇండియన్స్‌ – ఢిల్లీ క్యాపిటల్స్‌ (బెంగళూరు)
ఫిబ్రవరి 24- రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు – ఖూ వారియర్స్‌ (బెంగళూరు)
ఫిబ్రవరి 25- గుజరాత్‌ జెయింట్స్‌ – ముంబై ఇండియన్స్‌ (బెంగళూరు)
ఫిబ్రవరి 26 – ఖూ వారియర్స్‌ – ఢిల్లీ క్యాపిటల్స్‌ (బెంగళూరు)
ఫిబ్రవరి 27 – రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు – గుజరాత్‌ జెయింట్స్‌ (బెంగళూరు)
ఫిబ్రవరి 28 – ముంబై ఇండియన్స్‌ – ఖూ వారియర్స్‌ (బెంగళూరు)
ఫిబ్రవరి 29 – రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఢిల్లీ క్యాపిటల్స్‌ (బెంగళూరు)
మార్చి 1 – ఖూ వారియర్స్‌ – గుజరాత్‌ జెయింట్స్‌ (బెంగళూరు)
మార్చి 2 – రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు – ముంబై ఇండియన్స్‌ (బెంగళూరు)
మార్చి 3 – గుజరాత్‌ జెయింట్స్‌ – ఢిల్లీ క్యాపిటల్స్‌ (బెంగళూరు)
మార్చి 4 – ఖూ వారియర్స్‌ – రాయల్‌ ఛాలెంజర్స్‌ (బెంగళూరు)
మార్చి 5 – ఢిల్లీ క్యాపిటల్స్‌ – ముంబై ఇండియన్స్‌ (ఢిల్లీ )
మార్చి 6 – గుజరాత్‌ జెయింట్స్‌ – రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఢిల్లీ )
మార్చి 7 – ఖూ వారియర్స్‌ – ముంబై ఇండియన్స్‌ (ఢిల్లీ)
మార్చి 8 – ఢిల్లీ క్యాపిటల్స్‌ – ఖూ వారియర్స్‌ (ఢిల్లీ)
మార్చి 9 – ముంబై ఇండియన్స్‌ – గుజరాత్‌ జెయింట్స్‌ (ఢిల్లీ
మార్చి 10 – ఢిల్లీ క్యాపిటల్స్‌ – రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఢిల్లీ)
మార్చి 11 – గుజరాత్‌ జెయింట్స్‌ – ఖూ వారియర్స్‌ (ఢిల్లీ)
మార్చి 12 – ముంబై ఇండియన్స్‌ – రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఢిల్లీ)
మార్చి 13 – ఢిల్లీ క్యాపిటల్స్‌ – గుజరాత్‌ జెయింట్స్‌ (ఢిల్లీ)
మార్చి 15 – ఎలిమినేటర్‌ (ఢిల్లీ)
మార్చి 17 – ఫైనల్‌ (ఢిల్లీ)

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు