Saturday, May 18, 2024

దళితులు అడుగుపెడితే ఆలయాలకి మయిల పడుతుందా..?

తప్పక చదవండి
  • మహిళా దళిత నేతకు జరిగిన పరాభవానికి భాద్యులెవ్వరు..?
  • ప్రజాప్రతినిధిగా పోటీ చేసే అభ్యర్థికే అవమానం ఎదురయితే..
  • సామాన్య దళితుల, గిరిజనుల పరిస్థితి ఎలావుందో చెప్పతరమా ?
  • తెలంగాణ సాధించుకున్నాక కూడా అంధకారంలోనే పల్లెలు, పట్టణాలు
  • మహిళను అవమానించిన బీఆర్ఎస్ నాయకులపై చర్యలెందుకు తీసుకోలేదు.

హైదరాబాద్ : ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు మండలం లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన రాష్ట్రంలో పెను సంచలనంగా మారింది.. . గడిచిన నెల 23వ తారీకు సోమవారం సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు మట్టా రాగమయి దసరా పండగ ఉత్సవాల్లో భాగంగా కల్లూరు మండలంలో పర్యటించారు. ఈ క్రమంలో చెన్నూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అధికార పార్టీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మట్టా రాగమయి కల్లూరు గ్రామంలోని ఆడపడుచులను పలకరిస్తూ ఆ గ్రామంలోని రామాలయం వద్దకు చేరుకొని గుడిలోని దేవుడుని దర్శించుకునేందుకు ప్రయత్నించగా, అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పాలేపు రామారావు, మట్టా దయ రాగమయిని అడ్డుకున్నారు. దళిత మహిళని గుడిలోకి ప్రవేశిస్తే గుడి అపవిత్రం అవుతుందని , ఆ కీడు.. ఆకివీడు గ్రామ ప్రజలపై పడుతుందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.

ఇరు వర్గాల మధ్య తోపులాట..
బీఆర్ఎస్ నాయకుల తీరుతో ఆగ్రహించిన మట్టా దయ రాగమయి అసహనం వ్యక్తం చేశారు దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో అక్కడ ఓ పసిబిడ్డకు కూడా గాయాలయ్యాయి. ఈ సందర్భంగా మట్టా దయానంద్ మాట్లాడుతూ దేవుని దర్శనానికి వెళ్లిన తనకు తన భార్యను కల్లూరు మండలం బిఆర్ఎస్ అధ్యక్షులు పాలకురామారావు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు . దళితులైనందున తమ పై ఈ విధమైనటువంటి దాడి చేయడం బీఆర్ఎస్ పార్టీ అరాచకానికి పరాకాష్టగా ఆయన పేర్కొన్నారు. ఒక దళిత ఎమ్మెల్యే ఆధ్వర్యంలో దళిత మహిళకు ఇలాంటి అవమానం జరుగుతున్నప్పటికీ కనీసం ఎమ్మెల్యే అడ్డుకోలేక పోయారని .. కనీసం ఇప్పటివరకు ఖండించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ పార్టీ పాలనలో మహిళలపై ఇలాంటి అఘాయిత్యాలు, అవమానాలు సర్వసాధారణమై పోయాయనని మట్టా రాఘవయ్య ఆవేదన వ్యక్తం చేశారు.. దళితులను అవమానించడమే పనిగా పెట్టుకున్న ఈ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ది చెప్పాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

సత్తుపల్లి కాంగ్రెస్ టికెట్ మట్టా రాగమయికె
ఖమ్మం జిల్లా సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి ఖరారయినట్లు తెలిసిం ది. ఈ స్థానం నుంచి పోటీకి అనేక మంది చూస్తున్నప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం డాక్టర్ మట్టా దయానంద్ సతీమని మట్టా రాగమయికి టికెట్ కెటాయిస్తూ పార్టీ కీలక నిర్ణయం తీసు కున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి తెలిసింది.. పొంగులేటి శ్రీనివాస రెడ్డి వీరికి టికెట్ రాకుండా శతవిధాలుగా ప్రయత్నం చేసినప్పటికీ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అధిష్టానం మట్టా రాగమయి కె మొగ్గు చూపినట్లు తెలిసింది..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు