Saturday, May 18, 2024

అధికారంలో ఉన్నప్పుడు ఏంచేశారు ..?

తప్పక చదవండి
  • ప్రజాపాలనపై దేశవ్యాప్తంగా ప్రశంశలు వస్తుంటే
  • బీ ఆర్ ఎస్ నాయకులు విమర్శలు చేయడం బాధాకరం
  • కేటీఆర్, హరీశ్ రావుపై బండ్ల గణేశ్ సంచలన కామెంట్స్

హైదరాబాద్ : తెలంగాణ మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుపై కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో బండ్ల గణేశ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. నిన్నటితో ప్రజా పాలన 30 రోజులు పూర్తి చేసుకుందని గుర్తుచేశారు.మిగతా రాష్ట్రాలన్నీ మెచ్చుకునేలా ప్రజాపాలన కొనసాగుతుంటే కేటీఆర్, హరీశ్ రావు ఈర్ష్య, అసూయ శిఖర స్థాయికి చేరుకుందని బండ్ల గణేశ్ అన్నారు. ‘వందరోజుల తర్వాత పప్పులు ఉడుకుతాయని అంటున్నారు.. పప్పులు ఉడకడం కాదు.. బిర్యానీ కూడా ఉడుకుతుంది హరీశ్ రావు’ అంటూ బండ్ల గణేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.అధికారంలో ఉన్న పది సంవత్సరాలు ఏం చేశారు? అని హరీశ్ రావుని బండ్ల గణేశ్ నిలదీశారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలపై కేంద్ర సర్కారుతో ఎందుకు కొట్లాడలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు కలిసి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో మాట్లాడుతున్నారని చెప్పారు.తెలంగాణకి రావాల్సిన నిధుల కోసం పోరాటం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డాక అవినీతి అధికారులను పక్కకు తప్పించారని చెప్పారు. నిజాయితీగా పనులు చేసుకునే అధికారులను నియమించుకుని పరిపాలన చేస్తున్నారని అన్నారు.వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క స్థానం కూడా గెలవదని బండ్ల గణేశ్ అన్నారు. కాంగ్రెస్ సర్కారు ప్రజలందరికీ అందుబాటులో ఉందని చెప్పారు. ప్రజలు తమకు ఏ సమస్య ఉన్నా ఇప్పుడు సచివాలయానికి వెళ్తున్నారని అన్నారు. పరిపాలన గొప్పగా ఉంటే కేటీఆర్, హరీశ్ రావు ఎందుకు ఇంతగా ఆగం అవుతున్నారని ప్రశ్నించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు