Tuesday, May 21, 2024

వాననీటి సద్వినియోగంతోనే నీటి సమస్యకు చెక్‌

తప్పక చదవండి
  • అధిక వర్షపాతం ఉన్న ప్రాంతం నుంచి నీటి తరలింపు
  • ఇరిగేషన్‌ సమస్యలకు ఆమోదయోగ్య పరిష్కారం రావాలి
  • దిగువ రాష్ట్రంగా ఉన్నప్పట్టికీ ఎపికి నీటి సమస్యలు
  • వ్యవసాయ రంగానికి రాష్ట్రంలో తీవ్ర నీటి కొరత
  • ఐసిఐడి అంతర్జాతీయ సదస్సులో సీఎం జగన్‌ వెల్లడి
  • జలవనరు పరిరక్షణకు కేంద్రం ప్రత్యేక చర్యలు
  • కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ వెల్లడి

విశాఖపట్టణం : సీజన్‌లో పడే ప్రతి వాన చుక్కనూ ఒడిసిపట్టి సద్వినియోగం చేసుకున్నప్పుడే కరవును ఎదుర్కోగలమని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. అధిక వర్షపాతమున్న ప్రాంతాల నుంచి కరవు కోరల్లో చిక్కిన భూములకు నీటిని మళ్లించే ప్రణాళిక అవసరమని చెప్పారు. విశాఖలో కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇరిగేషన్‌ అండ్‌ డ్రైనేజ్‌(ఐసీఐడీ)పై అంతర్జాతీయ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ హాజరయ్యారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 90 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. నీటి సమస్యలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాలు సూచించాలని కోరారు. రాష్ట్రం జలవనరులపరంగా మిగిలిన రాష్టాల్ర మాదిరిగానే సమస్యలు ఎదుర్కొంటోందని అన్నారు. వ్యవసాయానికి నీటికొరత ప్రధాన సమస్యగా ఉందని చెప్పారు. దీనికి మైక్రో ఇరిగేషన్‌ ఒక సమాధానంగా ఉంటుందని ఆయన అభిప్రాయ పడ్డారు. వర్షాలు కురిసే సమయం బాగా తగ్గిపోయిందని.. ప్రతి నీటి బొట్టునూ కాపాడుకోవాలన్నారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌, జల వనరుల నిపుణుడు ఎన్‌.డి.గులాటీ మాట్లాడుతూ.. ఉత్తమ వ్యవసాయ పద్ధతులు, జలవనరులను సమర్థంగా వినియోగించుకోవడం అవసరమన్నారు. భారత్‌లో ప్రస్తుతం 250 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల నీటి నిల్వ సామర్థ్యం ఉందని చెప్పారు. నీటి పునర్వినియోగానికి మంచి పరిష్కారాలను ఈ సదస్సు సూచించాలని కేంద్ర మంత్రి కోరారు. రాష్ట్రంలో సాగునీటిరంగం, వ్యవసాయం పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సీఎం జగన్‌ తెలిపారు. సుమారు 90 దేశాల నుంచి 500 మంది ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ నెల 8 వరకూ ప్లీనరీ జరగనుంది. తొలుత ముఖ్య అతిథులను సత్కరించిన అనంతరం వారికి నిర్వాహకులు జ్ఞాపికలు బహూకరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజనీ, గుడివాడ అమర్నాథ్‌ పాల్గొన్నారు. విశాఖలో నీటి పారుదల రంగంపై సదస్సు జరగడం శుభ పరిణామమని సీఎం జగన్‌ తెలిపారు. ఏపీలో విస్తారమైన తీర ప్రాంతం ఉందని, దాన్ని సక్రమంగా వినియోగించుకుంటున్నామని పేర్కొన్నారు.

సాగునీరు, వ్యవసాయం రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ప్రతీ నీటిబొట్టును ఒడిసి పట్టడమే లక్ష్యమని అన్నారు. రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో తరచూ కరువు వస్తోందని చెప్పారు. వర్షాలు తక్కువున్న సమయంలో నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న దేశ, విదేశీ ప్రతినిధులకు జగన్‌ కృతజ్ఞతలు తెలిపారు. దిగువ నదీ తీర రాష్ట్రంగా నీటి నిర్వహణ కోసం ఏపీ అనేక ఇబ్బందులు ఎదుర్కుంటోందన్నారు సీఎం జగన్‌. వంశధార, నాగావళి, కృష్ణ, గోదావరి నదులు ఉన్న అతివృష్టి, అనావృష్టి వల్ల నీటి నిర్వహణ పెను సవాల్‌ గా మారిందని వివరించారు. నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని, నీటిని ఒక బేసిన్‌ నుంచి ఇంకో బేసిన్‌ కు తరలించే వ్యవస్థ ఏర్పాటు కావాలని అన్నారు. అప్పుడే అన్ని వేళలా, అన్ని ప్రాంతాలకూ నీటి లభ్యత ఉంటుందని అభిప్రాయపడ్డారు. దేశంలో రైతులకు మేలు చేసేలా చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి షెకావత్‌ అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో జల సంరక్షణ చర్యలు చేపట్టామని, భూగర్భ జలాల సంరక్షణకు సరైన ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తులను పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తున్నట్లు వివరించారు. ప్రపంచ దేశాలకు భారత్‌ అతి పెద్ద ఎగుమతిదారుగా వృద్ధి చెందుతోందన్నారు. వాటర్‌ రీ సైక్లింగ్‌ విధానంతో మురికి నీటిని శుద్ధి చేస్తున్నామని, తాగు, సాగునీటికి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. 2019లో మోదీ ఆధ్వర్యంలో జలశక్తి అభియాన్‌ ప్రారంభించామని, దీని ద్వారా మెరుగైన ఫలితాలు వస్తున్నట్లు వెల్లడిరచారు. మరోవైపు, నదుల అనుసంధాన పక్రియ సైతం వేగంగా జరుగుతోందని షెకావత్‌ తెలిపారు. యూపీ, మధ్యప్రదేశ్‌ రాష్టాల్లోన్రి నదులను అనుసంధానం చేస్తున్నామని చెప్పారు. డ్యామ్‌ సేఫ్టీ యాక్ట్‌ ల ద్వారా డ్యామ్‌ ల పరిరక్షణ జరుగుతోందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా, ప్రపంచ బ్యాంకు సహకారంతో డ్యామ్స్‌ పరిరక్షిస్తున్నట్లు వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న 25 వ అంతర్జాతీయ కాంగ్రెస్‌, ఐసీఐడీ ఎక్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ 74వ అంతర్జాతీయ సమావేశాల ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గురువారం విశాఖకు చేరుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, ఐసీఐడీ ప్రతినిధులతో కలిసి అంతర్జాతీయ సమావేశాలను ముఖ్యమంత్రి జగన్‌ ప్రారంభించారు. వేదికగా వారం రోజుల పాటు ఈ అంతర్జాతీయ సమావేశాలు కొనసాగనున్నాయి. ఐసీఐడీ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ రగబ్‌ రగబ్‌, ఐసీఐడీ వైస్‌ ప్రెసిడెంట్‌ కుష్విందర్‌ వోహ్రా, జలవనరుల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శశి భూషణ్‌ కుమార్‌, రాష్ట్ర ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ధనుంజరు రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషనర్‌ హరి కిరణ్‌, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున, తదితరులు భాగస్వామ్యమయ్యారు. సుమారు 90 దేశాల నుంచి ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులకు నిర్వాహకులు సత్కారం చేసి జ్ఞాపికలను బహూకరించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు