Sunday, June 2, 2024

తరగని ఇంధనం…….జీవ ఇంధనం

తప్పక చదవండి

వాహనాల్లో ఇంధనంగా పెట్రోల్ లేదా డీజిల్ ను, విద్యుత్ తయారీలో బొగ్గు లేదా అణుశక్తిని వాడుతున్నాం. ఇవన్నీ పరిమితమైన వనరులు మాత్రమే గాక వాతావరణ కాలుష్య కారకాలు కూడాను. శిలాజ ఇంధనాల నిల్వలు త్వరగా కరిగి, తరిగి పోతున్నాయి.ఇలాగే శిలాజ ఇంధనాల వాడకం కొనసాగితే కొన్ని వందల సంవత్సరాల తరువాత శిలాజనిల్వలు నిండుకు పొయ్యి, బైకులు, కార్లు, బస్సులు, ట్రక్కులు, విమానాలు, ఓడలు ఏవి కదలవు.మళ్ళి మానవుడు ఎద్దుల బండ్లను. గుర్రపు బళ్ళను సైకిళ్ళను వాడ వలసి వుంటుంది. అందువల్ల వీటికి ప్రత్యామ్నాయం జీవ ఇంధనాలను వాడవలసిన అవసరం ఉంది. జీవ ఇంధనం అనేది జీవ ద్రవ్యాలనుండి ఉత్పత్తి కావింపబడు ఇంధనం. జీవద్రవ్యం లేదా జీవపదార్ధం అనేది జీవులనుండి ఏర్పడు లేదా ఉత్పత్తి కావించు పదార్ధం.ముఖ్యంగా జంతువుల కన్న మొక్కల నుండి ఏర్పడు, లేదా ఉత్పత్తి కావించు జీవద్రవ్యం పరిమాణం ఎక్కువ. జీవద్రవ్యం అనేది సులభంగా తక్కువ కాలవ్యవధిలో పునరుత్పత్తి కావించు అవకాశమున్న సేంద్రియ పదార్ధం. జీవద్రవ్యం నుండి ఉష్ణరసాయనిక చర్య లేదా జీవరసాయనిక చర్య వలన ఘన, ద్రవ లేదా వాయు జీవఇంధనాలను ఏర్పరచ వచ్చును. జీవద్రవ్యం లేదా జీవపదార్థాన్ని ఇంధనంగా విరివిగా వాడుఆవకాశం ఉంది. సాంప్రదాయ శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా సాంప్రదాయేతర ఇంధన వనరుల ప్రాముఖ్యతపై ప్రజలను అవగాహన పరచవలసిన అవసరం ఉంది. సర్ రుడాల్ఫ్ డీజిల్ అనే ఆయన వేరుశెనగ నూనెతో మెకానికల్ ఇంజిన్‌ను నడిపించాడు మరియు తరువాతి శతాబ్దంలో శిలాజ ఇంధనాల స్థానంలో కూరగాయల నూనె వచ్చే అవకాశం ఉందని అంచనా వేశాడు.
మనం నివసిస్తున్న ఈ భూమి మీద కాలుష్యాన్ని తగ్గించడానికి స్థిరమైన అభివృద్ధి కోసం సంప్రదాయేతర ఇంధన వనరులను ఉపయోగించడాన్ని ప్రజలందరూ గమనించాలి. జీవ ఇంధనాలు వ్యవసాయ వ్యర్థాలు, పంటలు, చెట్లు లేదా గడ్డి వంటి జీవ పదార్థాల నుండి ఉత్పన్నమయ్యే శక్తి యొక్క పునరుత్పాదక వనరులు. సాంప్రదాయ శిలాజ ఇంధనాలతో పోలిస్తే ఇవి తక్కువ కార్బన్ మోనాక్సైడ్ మరియు విషపూరిత ఉద్గారాలను విడుదల చేయడం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడమేగాక ముడి చమురుపై దిగుమతి ఆధారపడటాన్ని తగ్గిస్తాయి. జీవ ఇంధనం పర్యావరణానికి అనుకూలమైనది. ఇవి ప్రస్తుతం వాడుతున్న ఇందనాల కంటే 86 శాతం వరకు తక్కువ గ్రీన్ హౌస్ వాయువులను, 47 శాతం తక్కువ రేణువులను ఉత్పత్తి చేస్తాయి. ప్రస్తుతం ప్రపంచ రవాణాలో వీటి వాటా 3 శాతంగా ఉంది. 2050 సంవత్సరం నాటికి వీటి వాటా 25 శాతంగా ఉండాలని పారీస్ లో ఉన్న అంతర్జాతీయ ఇంధన సంస్థ ( ఐ.ఇ.ఎ ) అన్ని దేశాలకు సూచింది. చెరకు, చక్కెర దుంపలు, తీపి జొన్నలు మొదలైన చక్కెర కలిగిన పదార్ధాల వంటి బయోమాస్ నుండి ఉత్పత్తి చేయబడిన ఇథనాల్, తినదగిన కూరగాయల నూనెలు, యాసిడ్ నూనె, ఉపయోగించిన వంట నూనె లేదా జంతువుల కొవ్వు మరియు బయో-ఆయిల్ నుండి ఉత్పత్తి చేయబడిన కొవ్వు ఆమ్లాల మిథైల్ లేదా ఇథైల్ ఈస్టర్ వంటి బయో డీజిల్, వ్యవసాయ మరియు అటవీ అవశేషాలు అనగా వరి & గోధుమ గడ్డి,మొక్కజొన్న కాబ్‌లు & స్టవర్, బాగాస్సే, వుడీ బయోమాస్, ఆహారేతర పంటలు అనగా గడ్డి, ఆల్గే లేదా పారిశ్రామిక వ్యర్థాలు మరియు అవశేషాల ప్రవాహాల నుండి తయారయ్యే ఇంధనాలు, డ్రాప్-ఇన్ ఇంధనాలు,బయో-సి. యన్. జి వంటి వాటిని జీవ ఇందనాలకు ఉదాహరణగా చెప్పవచ్చు.2018 లో స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామిన్) కింద గోబార్ (గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో-అగ్రో రిసోర్సెస్) పథకం ప్రారంభించబడింది. వ్యాపార వెంచర్ల అభివృద్ధికి పర్యావరణాన్ని పెంపొందించడం మరియు 2జి ఇథనాల్‌ లో పరిశోధన మరియు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ప్రధాన్ మంత్రి జీవన్ యోజన 2019,ఉపయోగించిన వంట నూనెను సేకరించి బయోడీజిల్‌గా మార్చే పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల అథారిటీ( యఫ్ .ఎస్.ఎస్.ఎ .ఐ ) ద్వారా రీపర్పస్ యూజ్డ్ కుకింగ్ ఆయిల్ కార్యక్రమం ప్రారంభించబడింది.బయోఇథనాల్‌ను ఉత్పత్తి చేయడానికి మిగులు ఆహార ధాన్యాలు మరియు బయోమాస్‌ను ఉపయోగించుకోవడానికి కూడా ప్రభుత్వం అనుమతించింది. ఇంకా
2013-14 ఇథనాల్ సరఫరా సంవత్సరంలో భారతదేశం యొక్క ఇథనాల్ సామర్థ్యం 1.53% నుండి 2020-21లో 7.93%కి పెరిగినట్లు నివేదించబడింది. 2013-14లో 38 కోట్ల లీటర్లు ఉన్న ఇథనాల్ సరఫరా 2020-21లో 322 కోట్ల లీటర్లకు పెరిగింది. అదేవిధంగా, ఇథనాల్ బ్లెండింగ్ శాతం కూడా 2013-14లో 1.53% నుండి 2020-21లో 8.50%కి పెరుగుతుందని అంచనా. డిమాండ్ పెరుగుదల కారణంగా, ఇథనాల్ స్వేదనం సామర్థ్యం కూడా 215 కోట్ల లీటర్ల నుండి ఏటా 427 కోట్ల లీటర్లకు రెట్టింపు అయింది. 2014-15లో 157 ఉన్న డిస్టిలరీల సంఖ్య 5 సంవత్సరాలలో 40% పెరిగి 2019-20లో 231కి చేరుకుంది. దేశంలో బయో-డీజిల్ మిశ్రమం 2001లో పైలట్ ప్రాతిపదికన ప్రారంభమైంది.ప్రభుత్వం జూన్ 2018లో జీవ ఇంధనాలపై జాతీయ విధానాన్ని ఆమోదించింది-2018. ఈ పాలసీ లక్ష్యం 2030 నాటికి 20% ఇథనాల్-బ్లెండింగ్ మరియు 5% బయోడీజిల్-బ్లెండింగ్‌కు చేరుకోవడం. ఇతర విషయాలతోపాటు, ఈ విధానం ఇథనాల్ కోసం ఫీడ్‌స్టాక్ పరిధిని విస్తరిస్తుంది. ఉత్పత్తి మరియు అధునాతన జీవ ఇంధనాల ఉత్పత్తికి ప్రోత్సాహకాలను అందించింది. జీవ ఇంధనాల రంగం పురోగతి కారణంగా ఈ విధానం మే 2022లో సవరించబడింది. మనమందరం జీవ ఇంధనాలను వాడుదాం. జీవుల మనుగడకు సహకరిద్దాం.

జనక మోహన రావు దుంగ
యం.ఎస్సీ , బి.యడ్
అధ్యాపకుడు, ఆమదాలవలస
శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఫోన్ : 8247045230

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు