Sunday, May 19, 2024

ఆజ్ కి బాత్..

తప్పక చదవండి

ఓ పాపిష్టి పాలకులారా
మీ గెలుపు కోసం ఆ పూటకు
మీ కుండలో ఉడికినా బువ్వపెడ్తిరి..
మీ రాజకీయ బాటల కోసం మా వీపులపై
తొక్కుకుంటా నడిచిపోతిరి…
మీ పగలకు మా పేదోళ్ల కుత్తుకలు నేలరాలిపోయినా
ఒక్కడికైనా నడి బజార్లో
మా పేదల విగ్రహం ఉందో చెప్పండి..?
పదవులు మీవే.. పీఠాలు మీవే
పాసిపోయిన ఎంగిలి మెత్కుల యావనే మాది.
మీరు గెలిచేంత వరకే మా పేర్లు గుర్తుంటవి
పీఠమెక్కినాక మా పీనుగెల్లినా మీకు మతికిరాదు.
చివరికి మిమ్మల్ని ప్రధాన మంత్రుల్ని చేసినా
మేము మనుషులమనే సుద్ది మీకు గుర్తుకైతే రాదు.

  • కనకమామిడి సన్నీ
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు