Friday, May 17, 2024

రహీంగుడా తండా పోలింగ్‌ కేంద్రంలో నిబంధనలు ఉల్లంఘన

తప్పక చదవండి
  • ఫోన్లను అనుమతించిన తీరు పై కలకలం

చిలిపిచేడ్‌ : నర్సాపూర్‌ నియోజకవర్గం చిలిపి చేడ్‌ మండలంలో ఎలక్షన్‌ కోడ్‌ ను ఉల్లంఘించారని ఓటర్లు ఆరోపించారు. పోలింగ్‌ జరుగుతున్న సమయంలో చిన్నారులు పోలింగ్‌ కేంద్రంలో యదేచ్చగా సెల్‌ ఫోన్‌ లో గేమ్స్‌ ఆడడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.పోలింగ్‌ కేంద్రంలోకి ఓటర్లు, నాయకులు ఇతర సిబ్బంది ఎవరైనా కూడా సెల్‌ ఫోన్‌ వాడడం నిషేధం అయినప్పటికీ ఎన్నికల కోడ్‌ నీ పట్టించుకోకుండా చిన్నారులు,వాలెంటర్స్‌ సెల్‌ ఫోన్‌ పోలింగ్‌ కేంద్రంలోకి తీసుకురావడంతో పాటు కూర్చొని ఫోన్‌ లో గేమ్స్‌ ఆడుతూ,వాట్సప్‌ లో మెసేజ్‌ లు చేసుకుంటూ కూర్చున్నారు.ఈ తంతు జరుగుతున్నప్పటికి ఎన్నికల సిబ్బంది వారిని వారించకుండా పట్టించుకోకపోవడం గమనార్హం.ఈ ఘటన చిలిపిచేడ్‌ మండలంలోని రహీంగుడా తండా గ్రామ పంచాయతీలో ఏర్పాటుచేసిన పోలింగ్‌ బూత్‌ (133)లో చోటుచేసుకుంది. దీంతో సజావుగా జరగాల్సిన పోలింగ్‌ గందరగోళంగా మారింది. పోలింగ్‌ కేంద్రం పరిధిలో 144 సెక్షన్స్‌ అమలు లో ఉన్నా, దానిని అమలు చేయడంలో భద్రత సిబ్బంది విఫలమయ్యారు.ఈ పోలింగ్‌ కేంద్రం లో వెబ్‌ కాస్టింగ్‌ చేయకపోవడం,సీసీ కెమెరాలు లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనబడుతోంది.నిర్లక్ష్యంగా పోలింగ్‌ జరుగుతుంటే జిల్లా ఉన్నతాధికారులు ఏం పట్టించుకుంటున్నారని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు