Saturday, April 27, 2024

జిల్లాలోని అన్ని గ్రామాల్లో విహెచ్‌పి కమిటీలు

తప్పక చదవండి
  • విహెచ్‌పిలో స్వ‌చ్ఛంధంగా చేరుతున్న యువ‌త‌
  • గడపగడపకి అయోధ్య అక్షింతలు పంపిణీ కార్యక్రమంలో వ‌క్త‌లు

అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా గ్రామగ్రామాణ గడపగడపకి అయోధ్య అక్షింతలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి ముడుపు యాదిరెడ్డి పాల్గొని మార్గదర్శనం చేశారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్ని గ్రామాల్లో విహెచ్‌పి కమిటీలు, బజరంగ్ దళ్ యువ బృందాలు ఏర్పాటు చేస్తామని, ఇప్పటికే వందల గ్రామాల్లో యువకులు విహెచ్‌పిలో చేరుతున్నారు.. ఇంకా అనేకమంది యువ‌కులు స్వచ్చందంగా వస్తున్నారని, రాబోయే రోజుల్లో శారీరక, భౌద్దిక, ధార్మిక శిక్షణ నిర్వహిస్తామని తెలిపారు. ప్రాంత మందిర అర్చక పురోహిత్ సహ ప్రముఖ్ ఓరుగంటి సురేష్ మాట్లాడుతూ వేదాశీర్వచనం చేస్తూ భద్రాచలంలో కల్యాణ రాముడు అయోధ్యలో బాలరాముని గురించి వివరించారు.

జిల్లా అధ్యక్షుడు నాగేశ్వర్ రావు మాట్లాడుతూ రామకార్యమును రామరాజ్యం ను ఎవరు ఆపలేరని అందరం రామరాజ్యం కోసం ధర్మ రక్షణ కోసం సమయం ఇచ్చి పనిచేయాలని చెప్పారు. విభాగ్ సంఘటన కార్యదర్శి గడిదేశి వెంకటేశ్వలు మాట్లాడుతూ ధర్మ రక్షణ కోసం హిందూ సమాజము సమాయత్తం అవుతుంద‌ని, దానికి నిదర్శనం అక్షింతల పంపిణీ కార్యక్రమం అని అన్నారు. జిల్లా కార్యదర్శి సీతమ్మ మాట్లాడుతూ కార్యక్రమంలో పాల్గొన్న సమస్త హిందూ బంధువులకు అభినందనలు తెలిపారు. ఇంకా ఇందులో విభాగ్ మాతృశక్తి సంయోజిక రేగడి విజయలక్ష్మి, విభాగ్ మందిర అర్చక పురోహిత్ ప్రముఖ్ తేజావత్ రాములు, జిల్లా ఉపాధ్యక్షులు దారా రమేష్, కోమటినేని నాగమణి, జిల్లా సంఘటన కార్యదర్శి చిట్టెంశెట్టి లక్ష్మయ్య, జిల్లా సహ కార్య బజరంగ్దళ్ సంయోజక్ మెరుగు చింటేశ్వర్, జిల్లా కమిటీ సభ్యులు, అన్నీ ప్రఖండలు, మండలాల అధ్యక్షులు, కార్యదర్శి లు, బజరంగ్దళ్ సంయోజక్ లు, మాతృశక్తి, దుర్గావాహిని సంయోజిక లు, అక్షింతల పంపిణీ లో పాల్గొన్న అనేక మంది రామ భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. మొత్తం 334 గ్రామాల నుండి 2460 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు