Sunday, April 28, 2024

అర్బన్ రైజ్ శిల్పా.. దగా

తప్పక చదవండి

( అర్బన్ రైజ్ శిల్పా బొటానికా ఫార్మా సిటీ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ విల్లా ఎట్ ఫార్మా సిటీ పేరుతో దగా.. )

  • అమాయకుల జీవితాలను నట్టేట ముంచుతున్న వైనం..
  • అక్రమ మార్గంలో అనుమతులు పొంది లే అవుట్..
  • నక్షా బాట, మూడు చెరువులను మాయం చేసిన రియల్టర్..
  • గజం రూ. 24 వేల చొప్పున అంటగడుతున్న దుర్మార్గం..
  • రంగుల బ్రోచర్లు, డిజిటల్ మ్యాపింగ్ ప్రెసెంటేషన్ ద్వారా మాయాజాలం..

రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం నియోజక వర్గం, కందుకూరు మండలం, సర్వరావు పల్లె గ్రామంలో అర్బన్ రైజ్ శిల్పా బొటానికా ఫార్మా సిటీ, ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్ ఎట్ ఫార్మా సిటీ పేరుతో పలుకుబడి కలిగిన ఓ రాజకీయ నాయకుడికి సంబంధించిన వ్యక్తులు దాదాపు 331 ఎకరాల్లో లే అవుట్ వేసి.. విలేజ్ మ్యాప్ ప్రకారం ఉండాల్సిన నక్షా బాటను, మూడు చెరువులను మాయం చేస్తూ.. పెద్ద పెద్ద గుట్టలను నేలమట్టం చేస్తూ.. రక్షిత కౌలుదారు చట్టం ప్రకారం కొంతమంది హక్కు దార్ల హక్కులను కాలరాస్తూ.. రంగు రంగుల బ్రోచర్లు, డిజిటల్ మ్యాపింగ్ ప్రెజంటేషన్ ద్వారా జనాలను మోసం చేస్తూ.. గజం రూ. 24 వేల చొప్పున అమాయకులకు అంట గడుతున్నారు.. అయితే ఈ వ్యవహారం వెనుక ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు ఉన్నట్టు తెలుస్తోంది.. ఈ అక్రమ వ్యవహారం వెనుక దాగి ఉన్న వాస్తవాలను ఆధారాలతో సహా వెలుగులోకి తీసుకుని రానుంది ‘ ఆదాబ్ హైదరాబాద్ ‘.. ‘ మా అక్షరం అవినీతిపై అస్త్రం..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు