Monday, April 29, 2024

పుణే ఎక్స్‌ప్రెస్ వేపై ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడి పేలుడు..

తప్పక చదవండి
  • నలుగురు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు..
  • ఆయిల్ లీక్ అయి పక్కన ఉన్న ప్రాంతాలకు వ్యాపించిన మంటలు

ముంబై, 13 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కెమికల్‌ లోడ్‌తో వెళ్తున్న ట్యాంకర్‌ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. లోనావాలా – ఖండాలా ఎక్స్‌ప్రెస్‌వే మార్గంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. లోనావాలా సమీపంలో ఉన్న ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ట్యాంకర్ బోల్తా పడటంతో మంటలు చెలరేగాయి. ట్యాంకర్ నుంచి ఆయిల్ లీక్ కావడంతో అది చుట్టు పక్కలకు వ్యాపించడంతో అక్కడా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతంలో భారీగా మంటలు, పొగ అలుముకున్నాయి. ఈ దుర్ఘటనలో నలుగురు వ్యక్తులు చనిపోయారు. మరికొంత మందికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంటలు బ్రిడ్జి కిందకు కూడా వ్యాపించడంతో పరిస్థితి మరింత తీవ్రతరమైంది. భారీగా ఎగిసి పడుతున్న మంటలు చాలా దూరం కనిపించాయి..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు