Sunday, April 21, 2024

ఆయోధ్యపురంలో అపూర్వ ఘట్టం..

తప్పక చదవండి

జగదాభి రామునికి నేడే పట్టాభిషేకం సర్వాంగ సుందరంగా సిద్ధమైన అయోధ్య నగరం

  • ఓవైపు రామ నామ స్మరణ.. మరోవైపు పటిష్ఠ బందోబస్తు..
  • రామ మందిర ప్రారంభోత్సవం- ఏర్పాట్లు పూర్తి..
  • రామమందిర ప్రారంభోత్సవంతో పాటు
  • బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం..
  • వేడుకలకు హాజరుకానున్న లక్షలాది భక్తులు
  • అనంతరం ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ

రామ మందిర ప్రారంభోత్సవం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధికారులు, అయోధ్యవాసులు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఆలయం వద్ద సోమవారం ఉదయం నుంచే వివిధ కార్యక్రమాలు జరుగుతాయని తెలుస్తోంది.ఇక.. మోదీ అయోధ్యకు వచ్చిన తర్వాత.. సోమవారం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల నుంచి 1 గంట వరకు జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటారు. వేద పండితులు, సంప్రదాయాలు, ఆచారాల మధ్య ఈ కార్యక్రమం జరుగుతుంది. అనంతరం.. 7వేల మందితో కూడిన భారీ సభను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తారు.
లక్షలాది మంది ప్రజలు టీవీల్లో లైవ్‌ ద్వారా వీక్షిస్తారని అంచనాలు
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవాన్ని లక్షలాది మంది ప్రజలు టీవీల్లో లైవ్‌ ద్వారా వీక్షిస్తారని అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. టీవీతో పాటు ఆన్‌లైన్‌ వేదికల్లో ఈవెంట్‌ని ప్రత్యక్ష ప్రశారం చేయనుంది.మరోవైపు.. రామ మందిర ప్రారం భోత్స వాన్ని కనులారా చూసేందుకు.. బీజేపీ పాలిత ప్రాంతాలతో పాటు ఒడిశా ప్రభుత్వం కూడా..ఇప్పటికే పబ్లిక్‌ హాలీడేని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం.. తమ ఉద్యోగులకు హాఫ్‌ డే సెలవు ఇచ్చింది
దేశం మొత్తం పండుగ వాతావరణం నెలకొంది
అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా దేశం మొత్తం పండుగ వాతావరణం నెలకొంది. బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేళ.. ప్రతి ఇల్లు పూజా మందిరంలా మారగా.. ప్రతి ఆలయం రామ నామస్మరణతో మార్మోగుతోంది. 2019 నవంబర్‌ 9న సుప్రీం కోర్టు అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. సుమారు రూ.1800 కోట్ల వ్యయంతో రామ మందిరాన్ని నిర్మించారు. ఇంత మొత్తం ఖర్చు చేసినప్పటికీ.. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ వద్ద ఇప్పటికీ భారీ మొత్తంలో నిధులు ఉన్నాయి. అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం హిందువులంతా తమ తోచినంత విరాళాలు ఇవ్వడమే దీనికి కారణం.అయితే రామ మందిరం నిర్మాణం అంత ఆషామాషీగా ఏం జరగలేదు. సుదీర్ఘ న్యాయపోరాటం చేసి… ఎంతో కాలం వేచి చూసిన తర్వాత అయోధ్య రామ మందిర కల ఫలించలేదు.అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్టా కార్యక్రమం కోసం ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ వేడుకలను దగ్గరగా వీక్షించేందుకు అనేక మంది ఇప్పటికే అయోధ్యకు బయలుదేరగా ..అక్కడికి వెళ్లలేని వారు సైతం ఇంట్లో ఫ్యామిలీతో కలిసి టీవీలో ప్రత్యక్షంగా ల్కెవ్‌లో వీక్షించవచ్చు. అయితే ఏ ఛానెల్లో ల్కెవ్‌ ప్రసారం జరుగుతుంది. ఏ సమయం నుంచి చూడాలనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
ఈ వేడుకను అత్యాధునిక 4కె టెక్నాలజీలో ప్రసారం చేయనున్నారు.
మీరు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చూడడానికి అయోధ్యకు వెళ్లలేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ కార్యక్రమం డిడి న్యూస్‌, దూరదర్శన్‌ తో పాటు పలు జాతీయ ఛానెల్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. అయోధ్యలో జరుగుతున్న వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి కేంద్రం అనుమతించింది.డీడీ న్యూస్‌ అయోధ్యలోని పలు ప్రాంతాల్లో 40 కెమెరాలను ఏర్పాటు చేసింది. వాటి ద్వారా రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షకులకు కళ్లకుకట్టినట్లు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపించే ప్రయత్నంచేస్తోంది.. . ప్రధాన ఆలయ ప్రాంగణంతో పాటు సరయూ ఘాట్‌ సమీపంలోని రామ్‌ కి పైడి, కుబేర్‌ తిలా వద్ద ఉన్న జటాయు విగ్రహం, ఇతర ప్రదేశాల నుంచి ప్రత్యక్ష ప్రసార దృశ్యాలను వీక్షలకు చూపించనున్నారు. ఈ వేడుకను అత్యాధునిక 4కె టెక్నాలజీలో ప్రసారం చేయనున్నారు. అయితే రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 22న మధ్యాహ్నం 12:29 మధ్యాహ్నం 8 సెకన్ల నుంచి 12:30 నిమిషాల 32 సెకన్ల వరకు జరగనుంది. ఈ క్రమంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు మొత్తం మతపరమైన వేడుకలను మాత్రమే ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
ఆలయం గురించి తెలుసా?
నాగార శైలిలో రామ మందిరాన్ని నిర్మించారు. ఈ ఆలయం మూడు అంతస్తులతో ఉంటుంది. ఆలయ సముదాయం మొత్తం 57 ఎకరాలు, అందులో 10 ఎకరాల్లో ఆలయం నిర్మించబడిరది .ఆలయం పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు, ఎత్తు 161 అడుగులు. ఆలయంలో 5 మంటపాలు, 318 స్తంభాలు ఉన్నాయి. ఒక స్తంభం 14.6 అడుగులు. ఆలయ పనులు 55 శాతం పూర్తయ్యాయి. మిగిలిన పనులు 2024 చివరి నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఆలయంలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌ అంటే గర్భగుడి సిద్ధంగా ఉంది. మొదటి అంతస్తు కూడా దాదాపు 80% పూర్తయింది.
సాదరణ సమయాల్లో అయోధ్యకు ఎలా వెళ్లాలి?
జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవంతో పాటు బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగనుంది. దీని తరువాత అంటే జనవరి 23 నుంచి అయోధ్యను సందర్శించాలని చాలామంది ఉవ్విళ్లూరుతున్నారు. మరి అయోధ్యకు ఎలా వెళ్లాలి? అక్కడ రోజూ జరిగే పూజలేమిటి? రామాలయం సందర్శనలో ఎటువంటి విధివిధానాలు ఆచరించాలి? ఈ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం.
రైలు మార్గంలోనయితే ..
దేశంలోని ఏ ప్రాంతం నుంచి అయిన అయోధ్యకు చేరుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకు వెళ్లాలనుకునేవారు సికింద్రాబాద్‌ నుంచి రైలులో గోరఖ్‌ పూర్‌ వెళ్లాలి. అక్కడి నుంచి అయోధ్యకు రైలు లేదా బస్సు ద్వారా అయోధ్యకు చేరుకోవచ్చు.ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల 50 నిమిషాలకు సికింద్రా బాద్‌ నుంచి గోరఖ్‌ పూర్కు వెళ్లే రైలు అందుబాటులో ఉంది. ఈ రైలులో 30 గంటల పాటు ప్రయాణం చేయాలి. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి బీదర్‌ అయోధ్య వీక్లీ ఎక్స్‌ ప్రెస్‌ ప్రతి సోమ, ఆదివారాలలో అందుబాటులో ఉంది. మొత్తంగా తెలంగాణ నుంచి అయోధ్యకు వెళ్లాలనుకునే వారు ప్రతి శుక్ర, ఆది, సోమ వారాల్లో రైలు ప్రయాణం సాగించాల్సి ఉంటుంది. అయోధ్యకు వెళ్లే భక్తుల కోసం సికింద్రా బాద్‌ నుంచి ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. న్యూడీల్లి నుంచి రైలు మార్గం ద్వారా అయోధ్యకు వెళ్లాలనుకునేవారు దాదాపు 10 గంటలపైగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
రోడ్డు మార్గం ద్వారానయితే ..
అయోధ్యకు వెళ్లేందుకు హైదరాబాద్‌ నుంచి ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఏసీ బస్సులో ఒకరికి టికెట్‌ ధర రూ.6 వేలు ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి ప్రైవేటు వాహనాల్లో వెళ్లాలనుకునే వారు నాగపూర్‌, జబల్‌ పూర్‌, ప్రయాగ్‌ రాజ్‌ మీదుగా అయోధ్యకు చేరుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి అయోధ్యకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే మొత్తం 1305 కిలో మీటర్ల దూరం ప్రయాణం చేయాలి.
ప్రాణప్రతిష్ఠ ముగిశాక ఆ తర్వాతేంటి?
అయోధ్యలోని రామమందిరం ప్రారంభోత్సవం, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం (జనవరి 22) జరుగనున్న విషయం తెలిసిందే . ఇంతవరకూ బాగానే ఉంది కానీ, ఆ తర్వాత ఏంటి? అనేదే చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమం ముగిశాక ఏం చేస్తారు? చేపట్టబోయే ఇతర కార్యక్రమాలేంటి ? అనే ప్రశ్నలు సర్వత్ర తలెత్తాయి. ఈ ప్రశ్నలకు తాజాగా రామమందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్‌ నృపేంద్ర మిశ్రా సమాధానం ఇచ్చారు. ప్రాణప్రతిష్ఠ ముగిసిన వెంటనే తాము ఆలయ నిర్మాణ పనుల్ని చేపడతామని, ఈ ఏడాది చివరికల్లా మందిరాన్ని పూర్తి చేయాలని అనుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.ఒక వార్తా సంస్థతో నృపేంద్ర మిశ్రా మాట్లాడుతూ.. ‘‘ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ముగిశాక మేము కొత్త ఉత్సాహంతో, నిబద్ధతతో జనవరి 23వ తేదీ నుంచే ఆలయ నిర్మాణ పనులను ప్రారంభిస్తాం. మొత్తం ఆలయాన్ని 2024 చివరికల్లా పూర్తి చేయాలని అనుకుంటున్నాం. ఆలయ ప్రాంగణంలో మరో ఏడు ఉపఆలయాలు నిర్మించాల్సి ఉంది. రామ్‌లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమం ముగిసిన వెంటనే.. వాటి నిర్మాణ పనుల్ని మొదలుపెడతాం’’ అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో.. ప్రతిష్ఠాపన కార్యక్రమాల ఏర్పాట్లపై మాట్లాడుతూ, దేశానికి ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఈ ఏర్పాట్లను ఉంటాయని అన్నారు. ఈ ఏర్పాట్లకు తాము ఎంతో ప్రాముఖ్యత ఇచ్చామని, ఎలాంటి తప్పులు దొర్లకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతీదీ నిర్వహిస్తూ వచ్చామని మిశ్రా తెలిపారు.
రామ్‌లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది.
ఈ శుభసందర్భం చరిత్రలో నిలిచిపోయేలాగా.. సంగీత కార్యక్రమం ‘మంగళ ధ్వని’తో పాటు ఎన్నో కార్యక్రమాలను నిర్వహించబోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రారంభోత్సవానికి హాజరై.. మధ్యాహ్నం 12:15 గంటలకు రామాలయం గర్భగుడిలో పూజలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు ముగుస్తాయి. జనవరి 23వ తేదీ నుంచి సాధారణ భక్తులకు శ్రీరాముడిని దర్శించుకునేందుకు అనుమతి ఇవ్వనున్నారు. 2.7 ఎకరాల స్థలంలో ఈ ఆల యాన్ని 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు