Friday, May 3, 2024

జమ్మూ కశ్మీర్ కు కేంద్ర పాలిత హోదా శాశ్వతం కాదు..

తప్పక చదవండి
  • సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర ప్రభుత్వం..
  • దీనికి సంబంధించిన సమాచారం రేపు ధర్మాసనం ముందు పెడతాం..
  • రాష్ట్ర హోదా పునరుద్ధరణ ఎంతో కీలకం అన్న సుప్రీం ధర్మాసనం..

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌కు ఉన్నటువంటి కేంద్ర పాలిత హోదా శాశ్వతం కాదని తెలిపింది. అయితే ఇందుకు సబంధించిన సమాచారాన్ని కూడా ఆగస్టు 31న ధర్మాసనం ముందు పెడతామని పేర్కొంది. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రహోదా పునురుద్దరించేందుకు ఏదైనా కాల పరిమితి ఉందా.. అని సుప్రీం కోర్టు ప్రశ్నించగా.. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా సమాధానం ఇచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే ఆర్టికల్ 370 రద్ధును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. అయితే ఈ పిటీషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ కొనసాగించింది. ఈ సందర్భంగా వాదనలు విన్న చీఫ్ జస్టీస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యంగ ధర్మాసనం.. జమ్మూ కశ్మీర్‌లో ఉన్న ఎన్నికల ప్రజాస్వామ్యం చాలా ముఖ్యమైనదని తెలిపింది.

రాష్ట్ర హోదా పునరుద్ధరణ ఎంతో కీలకమని తెలిపిన సుప్రీం ధర్మాసనం.. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళిక ఉందని ప్రశ్నలు అడిగింది. అయితే ఇందుకు కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందించారు. జమ్మూకశ్మీర్‌కు కేంద్ర పాలిత హోదా అసలు శాశ్వతం కాదని తెలిపారు. అలాగే లద్దాఖ్‌కు సంబంధించినంత విషయానికి వస్తే యూనియన్ టెర్రిటరీ హోదా మరి కొంతకాల వరకు కొనసాగే అవకాశం ఉందని తుషార్ మెహతా అన్నారు. అయితే జమ్మూకశ్మీర్ యూటీ హోదాకు సంబంధించినటువంటి పూర్తి వివరణను ఆగస్టు 31న ధర్మాసనానికి తెలియజేస్తామని పేర్కొన్నారు. అయితే సొలిసిటర్ జనరల్ అభ్యర్థనను విన్నటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం.. జాతీయ భద్రత అంశం పరంగా రాష్ట్ర పునర్వవస్థీకరణను అంగీకరిస్తున్నా కూడా ప్రజాస్వామ్యం చాలా ముఖ్యమని పేర్కొంది. ఇప్పుడు సరైన కాలపరిమతిలో భాగంగా ప్రస్తుత పరిస్థితికి ముగింపు చెప్పాల్సిన అవసరం ఉందని తెలిపింది. అయితే ఎప్పటిలోగా వాస్తవికమైన ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తారో మాకు చెప్పాల్సిన అవసరం ఉందని.. సుప్రీంకోర్టు చెప్పింది. అలాగే కేంద్ర ప్రభుత్వం స్పందనను కూడా తెలియజేయాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాతో సహా అటర్నీ జనరల్ ఆర్ వెంకటరమణిలకు సుప్రీం ధర్మాసనం సూచనలు చేసింది. ఇదిలా ఉండగా 2019లో కేంద్ర ప్రభుత్వం ఆర్టకల్ 370ని రద్దు చేసిన విషయం తేలిసిందే. దీనివల్ల జమ్మూకశ్మీర్ తనకు అప్పటివరకు ఉన్న స్వయంప్రతిపత్తి హోదాని కోల్పోయింది. ఆ తర్వాత కేంద్రం జమ్మూకశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసింది. అయితే ఇప్పుడు మళ్లీ జమ్మూకశ్మీర్‌కు ఈ కేంద్ర పాలిత ప్రాంతం హోదా శాశ్వతం కాదు అని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు