Monday, May 6, 2024

డ్రగ్స్ కస్టమర్‌గా హీరో నవదీప్

తప్పక చదవండి
  • మాదాపూర్‌ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం
  • డ్రగ్స్ కస్టమర్‌గా ఉన్నాడంటూ సీపీ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్ : గతంలో తెలుగు రాష్ట్రాల్లో టాలీవుడ్ డ్రగ్స్ కేసు సంచలనం కాగా.. ఇప్పుడు మరోసారి మాదాపూర్ డ్రగ్స్‌ కేసు ప్రకంపనలు సృష్టిస్తుంది. అయితే.. ఈ మాదాపూర్ డ్రగ్స్ కేసుకు సంబంధించి సంచలన విషయాలను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. తాజాగా ఈ కేసులో హీరో నవదీప్‌కు సంబంధం ఉందని పోలీసులు తేల్చారు. మాదాపూర్ డ్రగ్స్ కేసుతో హీరో నవదీప్‌కు సంబంధం ఉందని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ సందర్భంగా నవదీప్‌కు డ్రగ్స్ డీలర్స్‌తో సంబంధం ఉందని తేల్చారు. ప్రస్తుతం నవదీప్ పరారీలో ఉన్నట్టు తెలిపారు. ఈ కేసులో నవదీప్ మేనేజర్ ను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. మరోవైపు ఈ కేసుతో సంబంధం ఉన్న దేవరకొండ సురేష్‌ను అరెస్ట్ చేసినట్టు తెలిపారు.

కొన్నాళ్ల క్రితం టాలీవుడ్‌లో పెద్ద ప్రకంపనలు పుట్టించిన డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ పలువురుకి క్లీన్ చిట్ ఇచ్చింది. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. ఈ కేసులో చిన్న పెద్దా అని తేడా లేకుండా చాలా మంది హీరోలు, హీరోయిన్లు, నటీనటుల, దర్శకుల చుట్టూ డ్రగ్స్ రాకేట్ ఉచ్చు బిగుసుకుంది. అందులో స్టార్ హీరో హీరోయిన్లు కూడా ఉండటం సంచలనంగా మారింది. ఒకప్పుడు బాలీవుడ్‌కు మాత్రమే పరిమితమైన డ్రగ్స్ మాఫియా.. తెలుగుతో పాటు తమిళ, కన్నడ ఇండస్ట్రీలకి కూడా పాకింది.అంతేకాదు టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కొంత మంది సెలబ్రిటీలు డ్రగ్స్ మాఫియాకు హవాలా రూపంలో చెల్లింపులు చేసింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు